ఆగస్టు 3న నీట్‌ పీజీ ఎంట్రన్స్‌ | NEET PG entrance on August 3rd | Sakshi
Sakshi News home page

ఆగస్టు 3న నీట్‌ పీజీ ఎంట్రన్స్‌

Jul 28 2025 6:00 AM | Updated on Jul 28 2025 6:00 AM

NEET PG entrance on August 3rd

ఒకే షిఫ్టులో నిర్వహణ.. 

ఈ నెల 31 నుంచి అడ్మిట్‌ కార్డులు

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా వచ్చే నెల 3న నీట్‌–పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 9 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు విద్యార్థులు 45 నిమిషాలకు ముందే ఎగ్జామ్‌ సెంటర్లకు చేరుకోవాల్సి ఉంది. వాస్తవానికి జూన్‌ 15న రెండు షిఫ్టుల్లో జరగాల్సిన ఈ పరీక్షను ఒకే షిఫ్టులో నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు ఆదే­శిం­చడంతో ఎన్‌బీఈఎంఎస్‌ దీన్ని ఆగస్టు 3కు వాయిదా వేసింది. 

దేశవ్యాప్తంగా 2 లక్షల మందికిపైగా విద్యార్థులు నీట్‌ పీజీ రాయనుండగా తెలంగాణ నుంచి సుమారు 10 వేల మంది రాసే అవకాశం ఉందని అంచనా. ఇందుకోసం రాష్ట్రంలో హైదరాబాద్‌ సహా 10 కేంద్రాలను ఎంపిక చేశారు. విద్యా­ర్థులకు జూలై 31 నుంచి అడ్మిట్‌ కార్డులు అందుబాటులో ఉంచనున్నారు. సెప్టెంబర్‌ 3 నాటికి ఫలితాలను ఆన్‌లైన్‌లో పొందుపరచ­నున్నారు. గతేడాది కౌన్సెలింగ్‌ ద్వారా మొత్తం 25,791 సీట్లను కేటాయించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement