నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది! | NEET Aspirant Pooja Ends Her Life in Jagtial District After Exam | Sakshi
Sakshi News home page

నీట్ పరీక్ష రాసింది.. ఇంటికొచ్చి ప్రాణం తీసుకుంది!

May 5 2025 4:32 PM | Updated on May 5 2025 4:56 PM

Student Ends Life In Jagtial District After Neet Exam

జగిత్యాల జిల్లా : జిల్లాలోని చల్ గల్ గ్రామానికి చెందిన జంగా పూజ(18) అనే విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నీట్ పరీక్ష రాసిన ఆమె.. పేపర్ ను క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రాసిన నీట్ పరీక్షలో ర్యాంకు రాకపోవడంతో రెండోసారి తాజాగా నీట్ పరీక్ష రాసింది. అయితే ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ ను క్రాస్ చెక్ చేసుకుని ర్యాంకు రాదనే ఆందోళనలో పడింది. ఈ క్రమంలోనే ఆత్మహత్య చేసుకుంది.

కాగా, జగిత్యాల జిల్లాలోని రెండు కేంద్రాల్లో నిర్వహించిన నీట్‌ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. నాచుపల్లి జేఎన్టీయూ కేంద్రాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తనిఖీ చేశారు. అక్కడి అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. విద్యార్థులు ఇబ్బందులు లేకుండా పరీక్ష రాసేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఒక సెంటర్‌లో 480, రెండో సెంటర్లో 278 మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. ఒక కేంద్రంలో 13 మంది, మరో కేంద్రంలో ఐదుగురు గైర్హాజరైనట్లు వివరించారు

మూడు నిమిషాల ఆలస్యం.. పరీక్షకు దూరం
మల్యాల: జేఎన్టీయూ పరీక్ష కేంద్రం తెలియక మూడు నిమిషాలు ఆలస్యంగా చేరుకున్న ఓ విద్యార్థిని పరీక్ష దూరమైంది. మల్లాపూర్‌ మండలం వీవీ.రావుపేటకు చెందిన సీహెచ్‌.నవ్యకు జేఎన్టీయూ కేంద్రం పడింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి బయల్దేరింది. ఇంజినీరింగ్‌ కళాశాల అడ్రస్‌పై అవగాహన లేక దిగువ కొండగట్టు వరకు వెళ్లారు. పూర్తి అడ్రస్‌ తెలుసుకుని వెళ్లే సరికి మూడు నిమిషాలు ఆలస్యం కావడంతో అక్కడున్న సిబ్బంది లోపలికి అనుమతించలేదు. గతంలో లాంగ్‌ టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా.. ఆశించిన ఫలితం రాలేదని, మరోసారి పరీక్షకు సన్నద్ధమైన రాయలేకపోయాయని ఆవేదనతో తిరిగి వెళ్లిపోయింది.

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement