బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026
జగిత్యాల: జిల్లాలోని కళాకారుల ఆధ్వర్యంలో ఆషాఢం బోనాల జాతరను మంగళవారం ఘనంగా నిర్వహించారు. మినీస్టేడియంలో 51 బోనాలతో కళాకారులు తరలివెళ్లారు. పాతబస్టాండ్ నుంచి జంబిగద్దె, అన్నపూర్ణ థియేటర్ చౌరస్తా మీదుగా పోచమ్మ ఆలయానికి చేరుకుని బోనాలు సమర్పించా రు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీక అని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఎల్‌నినో పరిస్థితులు పోయి వర్షాలు కురవాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఆకాంక్షించా రు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ పిలుపు ఇస్తే కళాకా రులే ప్రధాన పాత్ర పోషించారని పేర్కొన్నారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, శంకర్, అర్వ లక్ష్మీ, దయాల చంద్రకళ, వర్కింగ్ కమిటి సభ్యులు మల్లిక్‌తేజ, సీనియర్ కళాప్రతినిధులు కళాశ్రీ గుండేటి రాజు, అభి, కొమురవెల్లి చిరంజీవి, పీఎల్.రెడ్డి, సునిల్ పాల్గొన్నారు.
జాతీయజెండాలతో ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు
పాత బస్టాండ్ చౌరస్తాలో జాతీయ జెండా ప్రదర్శన
మెట్‌పల్లి: పట్టణంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో హర్‌ఘర్ తిరంగా
యాత్ర కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. 500మీటర్ల పొడవుతో తయారు చేసిన జాతీయ పతాకంతో పాఠశాలల విద్యార్థులతో కలిసి కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడుతాయన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, అనూప్‌రావు, ఏలేటి నరేందర్‌రెడ్డి, ధర్మపురి వేణుగోపాల్,
బొడ్ల ఆనంద్ తదితరులున్నారు.
కళాకారుల ఆటపాట


