పత్తిపైనే ఆశలు..! | - | Sakshi
Sakshi News home page

పత్తిపైనే ఆశలు..!

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

● గతంలో కంటే ఎక్కువ సాగు ● వరి తర్వాత పత్తికే ప్రాధాన్యం ● ఒకే సీసీఐ కేంద్రంతో ఇబ్బందులు ● కొన్నేళ్లుగా మార్కెట్‌లో మంచి ధర పలకడం, స్థానిక నేలలు అనుకూలించడంతో రైతులు వాణిజ్య పంటైన పత్తి వైపే తీవ్ర ఆసక్తి చూపుతున్నారు. ● నియోజకవర్గంలో ఇప్పటికే మెజారిటీ విస్తీర్ణంలో విత్తనాలు నాటడం పూర్తికాగా.. మొలకెత్తిన చేన్లలో కలుపు తీత, అంతరకృషి పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ● నకిలీ విత్తనాల నిరోధానికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం, రికార్డు దిగుబడులపై ఆశలతో రైతులు ఈసారి భారీ ఆశలే పెట్టుకున్నారు. ● పంట సాగులో రైతులు ముందంజలో ఉన్నప్పటికీ, మార్కెటింగ్‌ సమయం వచ్చేసరికి నిరీక్షణ తప్పడం లేదు. ● నియోజకవర్గం మొత్తానికి వెల్గటూరు మండలంలోని కొత్తపేట జన్నింగ్‌ మిల్లులో ఉన్న ఒక్క సీసీఐ కేంద్రమే ఏకై క ఆధారంగా మారింది. ● సుదూర గ్రామాల నుంచి పత్తిని ఒకే కేంద్రానికి తరలించాల్సి రావడంతో రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. ● ఒకేకేంద్రం ఉండటంతో వాహనాల రద్దీ పెరిగి, రోజులు తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ● సీసీఐ కేంద్రం వద్ద తిప్పలు భరించలేక చాలామంది రైతులు గ్రామీణ ప్రాంతాల్లో దళారులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముకొని నష్టపోతున్నారు. ● సాగు విస్తీర్ణానికి అనుగుణంగా ప్రభుత్వం తక్షణమే స్పందించి నియోజకవర్గంలో అదనపు సీసీఐ కొనుగోలు కేంద్రాలను అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

గొల్లపల్లి: జగిత్యాల జిల్లా అనగానే ప్రధానపంట అయిన వరి గుర్తొస్తుంది. అయితే సాగు గుర్తుకువచ్చినప్పటికీ, ధర్మపురి నియోజకవర్గానికి వచ్చేసరికి చిత్రం పూర్తిగా మారుతుంది. ఇక్కడి మెట్ట ప్రాంత పరిస్థితులకు అనుగుణంగా రైతాంగం వరి కంటే పత్తి సాగుకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తోంది. నీటి లభ్యత తక్కువగా ఉండే ఆరు మండలాల్లో వానకాలం పత్తి సాగు పనులు వేగంగా సాగుతున్నాయి.

మెట్ట ప్రాంతంలో మారిన సాగు

నియోజకవర్గంలో గతేడాది, ఈ ఏడాది సాగు, పెరిగిన విస్తీర్ణం వివరాలు (ఎకరాల్లో)

మండలం గతేడాది ఈఏడాది విస్తీర్ణం ధర్మపురి 3,350 3,400 50

గొల్లపల్లి 2,400 2,600 200

బుగ్గారం 1,105 1,133 28

వెల్గటూర్‌ 2,603 2,650 47

పెగడపల్లి 840 860 20

ధర్మారం 1,550 1,586 36

మొత్తం 11,848 12,229 381

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement