ప్యాకింగ్ చేసిన స్క్రబ్బర్
స్క్రబ్బర్ ప్యాకింగ్ చేసే యంత్రం
జగిత్యాలకు చెందిన ఓ మహిళ.. ఇన్‌స్టాగ్రాంలో పార్ట్‌టైం జాబ్‌లు, ఎంఎక్స్‌వో కంపెనీ పేరిట వర్క్ ఫ్రం హోం అంటూ ప్రకటన చూసింది. విజ యవాడలోని కొందరు నిర్వాహకులు తాము స్క్రబ్బర్లకు సంబంధించిన ప్యాకింగ్ చేయిస్తామని, మెటీరియల్ ఇస్తామని, ఇంటి వద్ద ఉండి పనిచేసుకుంటే నెలకు రూ.24వేలు ఇస్తామని ప్రకటించారు. ప్యాకింగ్ మెటీరియల్ కోసం రూ.1.50 లక్షలు చెల్లించింది. తనకు నెలనెలా ఠంఛనుగా రూ.24వేలు రావడంతో కరీంనగర్, గోదావరిఖనిలో ఉండే తన బంధువులు, స్నేహితులకు చెప్పడంతో వారూ చేరారు. ఇలా వందలాది మంది స్కీంలో చేరారు. వారికి ఒక ప్యాకింగ్ మెషీన్, కొన్ని స్క్రబ్బర్ల షీట్లు, ప్యాకింగ్ కవర్లు ఇచ్చారు. ప్యాకింగ్ చేసిన తరువాత స్థానికంగా సదరు కంపెనీ నియమించుకున్న డిస్ట్రిబ్యూటర్లు వచ్చి సామగ్రిని కలెక్ట్‌చేసి తీసుకెళ్లేవారు. పెద్దపల్లి నుంచి 30 మంది, కరీంనగర్ నుంచి 57, జగిత్యాలలో 52 మంది మహిళలు ఈ స్కీములో చేరారు.


