మెట్‌పల్లి రూరల్: మెట్‌పల్లి మండలం వేంపేట, మల్లాపూర్ మండలం మొగిలపేట ప్రభుత్వ పాఠశాలలను కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న విద్య, వసతులు, పారిశుధ్యం, తాగునీటిని పరిశీలించారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం రుచికరంగా అందించాలని నిర్వాహకులకు సూచించారు.
సీఎంఆర్ త్వరగా అప్పగించాలి
జగిత్యాల: బకాయి పడిన సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)ను యుద్ధప్రతిపాదికన పూర్తిచేసేలా చూడాలని, మిల్లింగ్, రవాణా, గోదాముల సమస్యలు తొలగించాలని కిసాన్‌మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గోపాల్‌రెడ్డి అదనపు కలెక్టర్ లతకు మంగళవారం వినతిపత్రం అందించారు. రైతులు వరి ఎక్కువ పండించారని, ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి గడువులో పంపించాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తి చేయలేదని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కొక్కు గంగాధర్, విజయ్, ఆముద రాజు, రాజేందర్‌రెడ్డి, మల్లేశం పాల్గొన్నారు.
ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు
మల్యాల: ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని డీఏవో భాస్కర్ అన్నారు. మండలంలోని తాటిపల్లి రైతు వేదికలో రైతునేస్తం కార్యక్రమంలో పాల్గొన్నారు. పామాయిల్ సాగు, తేనెటీగల పెంపకం, నానో యూరియా ఉపయోగాలపై శాస్త్రవేత్తలు వివరించగా వీక్షించారు. అనంతరం మండలంలోని పలు ఫర్టిలైజర్ దుకాణాలు, తక్కళ్లపల్లి సొసైటీని తనిఖీ చేశారు. ఆయా దు కాణాల్లో నిల్వలను బట్టి రైతులకు ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఏవో కె.చంద్రదీపక్, ఏఈఓలు కె.శ్రీనివాస్, ఈ.శ్రీనివాస్, ఎస్.శ్రీలేఖ, రైతులు పాల్గొన్నారు.
మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు
పెగడపల్లి: మెరుగైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ సుదర్శనం అన్నారు. పెగడపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 11 కేవీ ఏడుమోటలపల్లి సర్క్యూట్ బ్రేకర్‌ను డీఈఈ గంగా రాం, ఏడీఈ వరుణ్‌కుమార్‌తో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఏఈలు చంద్రశేఖర్‌రెడ్డి, మధు, సబ్ ఇంజినీర్ అజయ్, లైన్ ఇన్‌స్పెక్టర్లు, రవీందర్‌రెడ్డి, బాలునాయక్, వెంకటేశం, రాజేందర్, ఆనందం పాల్గొన్నారు.


