ఈకేవైసీతోనే సిలిండర్‌ | - | Sakshi
Sakshi News home page

ఈకేవైసీతోనే సిలిండర్‌

Aug 11 2026 11:58 PM | Updated on Aug 11 2026 11:58 PM

● లేకుంటే రావడం కష్టమే ● ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్న సంస్థలు ● ప్లేస్టోర్‌ నుంచి ‘ఇండియన్‌ ఆయిల్‌ వన్‌ ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ’ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ● లింక్‌ అయిన ఫోన్‌ నంబరు, మెయిల్‌తో పాస్‌వర్డ్‌ క్రియేట్‌ చేసి లాగిన్‌ అవ్వాలి. ● మొదటిసారి యూజర్‌ రిజిస్ట్రేషన్‌ పూర్తి చేసుకోవాలి. ● గ్యాస్‌ క్యాష్‌ మెమో లేదా సబ్‌స్క్రిప్షన్‌ వోచర్‌పై ఉన్న 16 అంకెల ఎల్‌పీజీ ఐడీని లింక్‌ చేయాలి. ● అందులో కస్టమర్‌ వివరాలు కనిపిస్తాయి. ● లాగిన్‌ అయ్యాక హోంపేజీలో ప్రొఫైల్‌పై క్లిక్‌ చేస్తే ఆధార్‌ లింక్‌ అండ్‌ ఈ–కేవైసీ స్టేటస్‌ కనిపిస్తుంది. ● పచ్చ రంగు టిక్‌ మార్క్‌ ఉంటే కేవైసీ పూర్తయినట్లు. కాకపోతే అక్కడే రీ–అథెంటికేషన్‌ బటన్‌ నొక్కి ముఖాన్ని స్కాన్‌ చేసి బయోమెట్రిక్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయాలి. ● ఒకవేళ మీ ఆధార్‌ బయోమెట్రిక్‌ లాక్‌ అయి ఉంటే మొదట దాన్ని అన్‌లాక్‌ చేయాలి. ● భారత్‌ గ్యాస్‌ వారు ‘హలో బీపీసీఎల్‌ ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ’యాప్‌లో ఈ–కేవైసీ చేసుకోవాలి. ● హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్నవారు ‘ఆధార్‌ ఫేస్‌ ఆర్డీ’ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుని ఈకేవైసీ చేసుకోవాలి.

జగిత్యాలరూరల్‌: సబ్సిడీ గ్యాస్‌ పక్కదారి పట్టకుండా కార్డు కలిగిన వారంతా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ మేరకు గ్యాస్‌ ఏజెన్సీలు పట్టణ, గ్రామీణప్రాంతాల వినియోగదారులతో ఈకేవైసీ చేస్తున్నాయి. ఈనెల 16లోగా తప్పనిసరిగా ఈ–కేవైసీ చేసుకోవాలని చెబుతున్నాయి. గడువు దాటితే సిలిండర్లు రావంటున్నాయి. ఏజెన్సీల వద్ద, యాప్‌లద్వారా మొబైల్‌లో లేదా ఇంట్లోనే బయోమెట్రిక్‌ ద్వారా కూడా ఈ–కేవైసీ చేసుకునే వెసులుబాటు ఉంది. జిల్లా వ్యాప్తంగా 3.50 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు, 18 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి. ఉజ్వల కనెక్షన్లు 52వేలు, దీపంపథకం 50వేల కనెక్షన్లు ఉన్నాయి. ఇప్పటివరకు 70 శాతం కార్డుదారులు మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. మిగతావారు గ్యాస్‌ రావాలంటే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంది.

ఈ–కేవైసీ ఇలా

తప్పనిసరి

గ్యాస్‌ సిలిండర్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతి వ్యక్తి ఈ–కేవైసీ చేయించాల్సిందే. గ్యాస్‌ కనెక్షన్లు పక్కదారి పట్టకుండా చమురు కంపెనీలే ఈ–కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశాయి. ప్రతి డిస్ట్రిబ్యూటర్‌ తమ దగ్గరున్న కార్డుదారులకు గ్యాస్‌ సరఫరా కావాలంటే ఈ–కేవైసీ చేయించాల్సిందే.

– జితేందర్‌రెడ్డి,

జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి

జిల్లాలో గ్యాస్‌ కనెక్షన్లు : 3.50 లక్షలు

డిస్ట్రిబ్యూటరీలు : 18

ఉజ్వల కనెక్షన్లు : 52 వేలు

దీపం పథకం కనెక్షన్లు : 50 వేలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement