నీట్‌ లీక్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం, కీలక ఆదేశాలు | NTA files affidavit in Supreme Court in NEET paper leak cites exam security reforms | Sakshi
Sakshi News home page

నీట్‌ లీక్‌పై సుప్రీం తీవ్ర ఆగ్రహం, కీలక ఆదేశాలు

May 29 2026 3:23 PM | Updated on May 29 2026 4:51 PM

NTA files affidavit in Supreme Court in NEET paper leak  cites exam security reforms

సాక్షి, ఢిల్లీ:  2026 నీట్-యూజీ (NEET-UG) ప్రశ్నపత్రం లీక్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పేపర్‌ లీక్‌పై ఆరు వారాల్లోగా ఆఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది.  పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందంటూ ఆందోళన వ్యక్తంచేసింది. పర్యవేక్షణ ఉన్నప్పటికీ పేపర్ లీక్ జరిగిందంటే ప్రక్రియలో లోపాలు ఉన్నట్టే అని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పై ఆగ్రహం చేసింది.

పరీక్షలనిర్వహణకు సమర్థవంతమైన యంత్రాంగం ఉండాలని సూచించింది. పేపర్ లీక్‌తోవిద్యార్థులుతీవ్ర మనోవేదనకు గురయ్యారని వ్యాఖ్యానించింది. నీట్‌ కేసులో బాధ్యులైన వారిని వెంటనే గుర్తించాలని తగిన చర్యలు చేపట్టాలంటూ ఆయాశాఖలకు మధ్యంతర ఉత్తర్వులు  జారీ చేసింది. 

ప్రస్తుతం కొనసాగుతున్న నీట్ 2026 పేపర్ లీక్ వివాదానికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) భారత సుప్రీంకోర్టులో ఒక ముఖ్యమైన అఫిడవిట్‌ను దాఖలు చేసింది. జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం  అడిగిన ప్రశ్నలకు సమాధానంగా, జూన్ 21న జరగబోయే నీట్ 2026 పునఃపరీక్షలో విశ్వాసం, పారదర్శకత, నిష్పక్షపాతాన్ని పునరుద్ధరించడానికి తాము కట్టుబడి ఉన్నామని NTA సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఈ విచారణకు ఎన్‌టీఏ, మాజీ ఇస్రో ఛైర్మన్ డాక్టర్ కె. రాధాకృష్ణన్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు.

నీట్ పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు విచారణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement