ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య | NEET Aspirant Dies By Suicide: Telangana | Sakshi
Sakshi News home page

ఒత్తిడితో నీట్‌ విద్యార్థిని ఆత్మహత్య

Jun 21 2026 5:28 AM | Updated on Jun 21 2026 5:28 AM

NEET Aspirant Dies By Suicide: Telangana

మియాపూర్‌ (హైదరాబాద్‌): నీట్‌ రీ ఎగ్జామ్‌కు సిద్ధమవుతున్న విద్యార్థిని చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన మియాపూర్‌ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. మియాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ శివప్రసాద్‌ వివరాలు తెలిపారు. వైఎస్‌ఆర్‌కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన షేక్‌సనా నీట్‌ ఎగ్జామ్‌కు సిద్ధం అవుతోంది. తండ్రి ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉంటుండగా, పది రోజుల కిందట షేక్‌ సనా తల్లి అబ్బునిసా సొంతూరికి వెళ్లింది. దీంతో సనా తన ఇద్దరు చెల్లెళ్లు ఇంట్లో ఉంది.

శనివారం చదువుకునేందుకు షేక్‌ సనా తన గదిలోకి వెళ్లి సాయంత్రం అయినా బయటకు రాకపోయేసరికి ఆమె చెల్లెళ్లు గది తలుపులు తెరిచి చూడగా ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకొని కనిపించింది. స్థానికుల సహాయంతో కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందింది.‘తల్లిదండ్రులను మెప్పించలేకపోతున్నా.. భయం, ఒత్తిడి, ఆత్మవిశ్వాసం కోల్పో యి బాధపడుతున్నాను. చదువులో కుటుంబ అంచనాలను అందుకోలేకపోతున్నా. గత పరీక్షల్లో వైఫల్యం కారణంగా బాధపడుతున్నా. నా బాధను ఎవరితో పంచుకోవాలో తెలియదు’అని సూసైడ్‌ నోట్‌లో పేర్కొంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement