ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా? | How blue crabs are devastating the fishing industry in southern France | Sakshi
Sakshi News home page

ఈ పీతను చూస్తే ఫ్రాన్స్‌కు భయం, ఎందుకో తెలుసా?

Jun 20 2026 1:14 PM | Updated on Jun 20 2026 1:15 PM

How blue crabs are devastating the fishing industry in southern France

పిల్లలూ... ఈ పీతను చూడండి. దీని దెబ్బకు ఫ్రాన్స్‌ దేశం గజగజ వణుకుతోంది. దీని పేరు ‘నీలి పీత’. ‘బ్లూ క్రాబ్‌’. దీని పుట్టినిల్లు అమెరికా. కాని ఓడల్లో సముద్ర నీరు నింపేటప్పుడు ఎలాగో చేరి ఫ్రాన్స్‌ సముద్రంలో పడింది. ఇంకేముంది... ఒక్కో ఆడపీత ఒకేసారి లక్షల గుడ్లు పెడుతుంది. అమెరికా సముద్రంలో ఈ పీతల్ని తినే ఆక్టోపస్‌లు ఉన్నాయి. ఫ్రాన్స్‌ సముద్రంలో లేవు. 

అమెరికాలో బ్లూ క్రాబ్‌ విలువైన సీఫుడ్‌. ప్రతి ఏడాది లక్షల టన్నులు పట్టి తింటారు, ఎగుమతి చేస్తారు. ఫ్రాన్స్‌లో పెద్దగా ఈ అలవాటు లేదు. ఈ నీలి పీతలకు ఆకలి ఎక్కువ. చిన్న చేపల్ని, మరో రకం పీతల్ని గుటుక్కుమనిపిస్తాయి. దాంతో ఫ్రాన్స్‌లో జాలర్లు వల వేస్తే చేపలు పడటం లేదు. ఈ పీతలే పడుతున్నాయి. ఫ్రాన్స్‌ సైంటిస్టులు మేం ఏమీ చేయలేము అని చేతులెత్తేశారు. ఇవి తగ్గాలంటే పట్టుకుని తినాల్సిందే అన్నారు. ప్రస్తుతం ఫ్రాన్స్‌లో పీతలు తినే  ప్రోగ్రామ్‌ నడుస్తోంది. అక్కడ బ్లూ క్రాబ్‌ బిర్యానీ, బ్లూ క్రాబ్‌ ఫ్రై  ఫేమస్‌ అయిపోయింది.

నీతి: వేరే దేశం నుంచి వచ్చిన జీవులు మన ఇంట్లో సమస్య తెస్తాయి. అందుకే ప్రకృతిని జాగ్రత్తగా చూసుకోవాలి. 

ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement