నీట్‌ నిర్వహణ భేష్‌.. ప్రధాని ప్రశంస | prime minister lauds successful conduct of neet re exam | Sakshi
Sakshi News home page

నీట్‌ నిర్వహణ భేష్‌.. ప్రధాని ప్రశంస

Jun 24 2026 8:10 PM | Updated on Jun 24 2026 8:16 PM

prime minister lauds successful conduct of neet re exam

ఢిల్లీ: నీట్‌ పునఃపరీక్ష విజయవంతంగా నిర్వహించారని ప్రధాని మోదీ విద్యాశాఖను కొనియాడారు. బుధవారం నిర్వహించిన కేబినేట్ సమావేశంలో వారికి అభినందనలు తెలిపారు. నీట్‌  ప్రక్రియ 'హోల్-గవర్నమెంట్' విధానాన్ని ప్రదర్శించిందని, మంత్రులు మరియు అధికారుల సమిష్టి కృషిని ఆయన ప్రశంసించారు.

కేబినేట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ "పరీక్ష సజావుగా, చిత్తశుద్ధితో" నిర్వహించబడింది. ప్రణాళిక అమలులో తమ మంత్రులు తమ బాధ్యతలు నిర్వహించారు. భవిష్యత్తులో సైతం ఇదే విధంగా  సమన్వయ విధానాన్ని అనుసరించాలి". అని ఆయన అన్నారు. అంతా కలిసి పనిచేస్తే ఏలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని నీట్‌ మరోసారి రుజువుచేసిందన్నారు.

ప్రధాని అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో  కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, నీట్ పునఃపరీక్ష నిర్వహించిన విధానాన్ని వివరించారు. పలు మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు,విభాగాలు  సమన్వయంతో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.కాగా నీట్‌ పునఃపరీక్ష జూన్‌ 21న దేశవ్యాప్తంగా 5,440 కేంద్రాలలో,విదేశాల్లోని 14 కేంద్రాలలో నిర్వహించారు. ఈ పరీక్షకు 20 లక్షలకు పైగా అభ్యర్థుల హాజరయ్యారు.

కాగా గత నెల మే 3న నిర్వహించిన నీట్ యూజీ (NEET UG) పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ నేపథ్యంలో కేంద్రం రద్దు చేసింది. "గెస్ పేపర్" పేరుతో లక్షల రూపాయలకు ప్రశ్నపత్రాలు అమ్ముడయ్యాయని, లీకేజీ నెట్‌వర్క్ సోషల్ మీడియా ద్వారా విస్తరించిందని దర్యాప్తులో తేలడంతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement