మహిళా సంఘాలను బలోపేతం చేయాలి
మల్లాపూర్: మహిళా సాధికారతే సమాజ అభివృద్ధికి మూలస్తంభమని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని రాఘవపేటలో ఈజీఎస్ నిధులు రూ.30లక్షలతో నిర్మించనున్న మూడు వీవోఏ భవనాలకు గురువారం భూమి పూజ చేశారు. మహిళాసంఘాలను ప్రభుత్వం బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. మహిళాసంఘాలు ఆర్థికంగా వృద్ధి చెందడానికి.. సమావేశాలు, శిక్షణ కోసం వీవోఏ భవనాలు ఎంతోగానే ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. అనంతరం పెద్దమ్మతల్లి జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, సర్పంచ్ తోట శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీకాంత్, పీఆర్ ఏఈ రాగసుధ, ఏపీఎం విమోచన, సీసీ లక్ష్మీరాజం, ఉపసర్పంచ్ నర్సయ్య, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్
రాఘవపేటలో వీవోఏ భవనాలకు భూమిపూజ


