గిరిజనులు ఆర్థిక అక్షరాస్యత పెంచుకోవాలి
● ఆర్‌బీఐ తెలంగాణ జనరల్ మేనేజర్ సుప్రభాత్
రాయికల్: గిరిజనులు ఆర్థిక అక్షరాస్యత పెంపొందించుకోవాలని ఆర్‌బీఐ తెలంగాణ జనరల్ మేనేజర్ సుప్రభాత్ అన్నారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో మండలంలోని జగన్నాథ్‌పూర్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరికి కేవైసీపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో అపరిచిత వ్యక్తుల నుంచి ఎవరు కాల్ చేసినా ఓటీపీ చెప్పవద్దని, అలాగే లింక్‌లపై క్లిక్ చేయవద్దని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రధానమంత్రి జీవనజ్యోతి, సురక్ష బీమా, అటల్ పెన్షన్ యోజన వంటి పథకాలతో పాటు మహిళలు ముద్ర లోన్లు పొంది ఉపాధి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శంకర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్‌కుమార్, టీజీబీ ఆర్‌ఎం రాజ్‌నరేంద్ర, తహసీల్దార్ నాగార్జున, ఎంపీవో సుష్మ, ఎస్‌బీఐ శాఖల మేనేజర్లు శంకర్, నరేశ్, పవన్, మాధురి, సెర్ఫ్ సీసీ లావణ్య, ఉపసర్పంచ్ మల్లయ్య పాల్గొన్నారు.


