‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు | - | Sakshi
Sakshi News home page

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

‘సాక్

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు

ఇబ్రహీంపట్నం: పదో తరగతి విద్యార్థులకు ‘సాక్షి’ అందిస్తున్న మ్యాథమేటిక్స్‌, ఫిజికల్‌ సైన్స్‌ స్టడీ మెటిరియల్‌ చదివితే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించవచ్చని తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. మండలకేంద్రంలోని మోడల్‌ స్కూ ల్‌లో పదో తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరి యల్‌ అందించారు. విద్యార్థులకు అర్థమయ్యేలా రూపొందించిన ‘సాక్షి’ యాజమాన్యానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు. ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌, వైస్‌ ప్రిన్సి పాల్‌ స్వర్ణలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

‘పది’లో ఉత్తమ మార్కులు సాధించాలి

మల్యాల: పదో తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలని, ఉత్తమ మార్కులు సాధించాలని డీఈవో కె.రాము అన్నారు. మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులం, జెడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాలలను గురువారం సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. ఏఎంఓ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎంఈఓ నీలగిరి జయసింహారావు, ప్రిన్సిపాల్‌ మానస, ప్రధానోపాధ్యాయురాలు శైలజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

వెల్గటూర్‌: మహాశివరాత్రి సందర్భంగా కోటిలింగాలలోని కోటేశ్వరస్వామి ఆలయంలో ధర్మపురి సీఐ రాంనర్సింహారెడ్డి గురువారం భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున వారికి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు. ఆలయ కమిటీ చైర్మన్‌ రమేశ్‌, ఈవో కాంతారెడ్డి, సర్పంచ్‌ పర్ష కోటయ్య, వెల్గటూర్‌, ధర్మపురి ఎస్సైలు ఉదయ్‌కుమార్‌, మహేశ్‌, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

విద్యుత్‌ ఉద్యోగుల నిరసన

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాకేంద్రంలోని విద్యుత్‌ కార్యాలయం ఎదుట ఉద్యోగులు గురువారం నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఎలక్ట్రిసిటి సవరణ బిల్లు–2025కు వ్యతిరేకంగా ఐక్య కార్యాచరణ పిలుపు మేరకు ఆందోళన చేశారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 29కార్మిక సంఘాలను రద్దు చేయాలని కుట్ర పన్నడం శోచనీయమన్నారు. ఎన్పీడీసీఎల్‌ ఎస్‌ఈ సుదర్శనం, డీఈలు అంజయ్య, గంగారాం, మధుసూదన్‌, గోపికృష్ణ, ఎస్‌ఏఓ శ్రీనివాస్‌, జేఏసీ నాయకులు చేరాలు, ప్రసాద్‌, రాంజీ, వరుణ్‌, జవహార్‌లాల్‌నాయక్‌, సతీష్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు భద్రత కల్పించండి

కోరుట్ల: జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు పోలీసులు భద్రత కల్పించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌ రావు కోరారు. ఈ మేరకు గురువారం ఎస్పీ అశోక్‌ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందించారు. కౌంటింగ్‌ నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు తమ అభ్యర్థులను బెదిరిస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని, గెలిచిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారని వివరించారు. కౌంటింగ్‌ తర్వాత ప్రజాతీర్పును వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్నారు. బెదిరింపులకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు1
1/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు2
2/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు3
3/3

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో అధిక మార్కులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement