నేడే ఓట్ల పండుగ | - | Sakshi
Sakshi News home page

నేడే ఓట్ల పండుగ

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

నేడే

నేడే ఓట్ల పండుగ

ఓటేద్దాం రండి.. పోలింగ్‌కు సర్వంసిద్ధం ఎన్నికల సిబ్బందికి సామగ్రి పంపిణీ డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల తరలిన సిబ్బంది జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకు ఓటింగ్‌

జగిత్యాల: మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. బుధవారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభం కానుంది. ఈ మేరకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లు చేసింది. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోని 136వార్డులకు సంబంధించిన సామగ్రిని ఆయా డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రాల వద్ద ఎన్నికల సిబ్బందికి అందించగా.. వారంతా సామగ్రితో పోలింగ్‌ కేంద్రాలకు తరలివెళ్లారు. బ్యాలెట్‌ బాక్స్‌లు, బ్యాలెట్‌ పేపర్లతో సహా బస్సులు, ఇతర వాహనాల్లో కేంద్రాలకు చేరుకున్నారు. పంపిణీ కేంద్రాల్లో టెంట్లు, టేబుల్స్‌ వేయించారు. పోలీసు, పోలింగ్‌ సిబ్బందికి భోజనం సమకూర్చారు. కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎస్పీ అశోక్‌కుమార్‌, అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, మున్సిపల్‌ కమిషనర్ల ఆధ్వర్యంలో పంపిణీ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డు చేశారు.

పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాలు

జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకు పోలింగ్‌ జరగనుంది. మొత్తంగా 2,31,627 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరికోసం 379 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 455 మంది పీవోలు, 455ఏపీవోలు, 1637 మంది సిబ్బందిని నియమించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేశారు.

భారీ బందోబస్తు

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల జనరల్‌ అబ్జర్వర్‌ కాళిచరణ్‌ సుదమారావు పర్యవేక్షించారు. క్రిటికల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తుతో నిఘా ఉంచారు.

మున్సిపల్‌ ఏర్పాట్లు పూర్తి

రాయికల్‌: మున్సిపాలిటీలో ఏర్పాట్లు పూర్తి చేశారు. డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రం నుంచి జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ నాగరాజు ఆధ్వర్యంలో సిబ్బందికి సామగ్రి పంపిణీ చేశారు. కమిషనర్‌ నాగరాజు మాట్లాడుతూ.. బల్దియాలో 13,084 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపడుతున్నట్లు ఎస్సై సుధీర్‌రావు పేర్కొన్నారు.

కోరుట్లలో 102 పోలింగ్‌ కేంద్రాలు

కోరుట్లరూరల్‌: పట్టణ శివారులోని ఎస్‌ఎఫ్‌ఎస్‌ స్కూల్‌లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబూషన్‌ కేంద్రంలో సిబ్బందికి ఎన్నికల సామగ్రి అందించారు. పట్టణంలోని 33వార్డులకు 102 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేసినట్లు సీఐ సురేష్‌ బాబు తెలిపారు.

ధర్మపురిలో 29 కేంద్రాలు

ధర్మపురి: బల్దియాలో 15 వార్డులకుగాను 29 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దివ్యాంగుల కోసం ర్యాంపులు ఏర్పాటు చేశారు. వీరంతా ప్రత్యేక క్యూలైన్ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌ జరిగే ప్రాంతాల్లో పోలీసులు 144 సెక్షన్‌ విధించారు.

పోలింగ్‌ కేంద్రాలకు చేరిన సిబ్బంది

మెట్‌పల్లి: పట్టణంలో 26వార్డులకు 75 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఎస్సారెస్పీ క్యాంపులో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ కేంద్రంలో పోలింగ్‌ సిబ్బందికి అధికారులు సామగ్రి అందించారు. అక్కడి నుంచి వాహనాల్లో సిబ్బంది పోలింగ్‌ కేంద్రాలకు చేరారని కమిషనర్‌ మోహన్‌ తెలిపారు.

రాయికల్‌: బ్యాలెట్‌ బాక్స్‌లతో సిబ్బంది

సమస్యలపై ఫిర్యాదుకు టోల్‌ఫ్రీ నంబరు 96662 34383

నేడే ఓట్ల పండుగ1
1/3

నేడే ఓట్ల పండుగ

నేడే ఓట్ల పండుగ2
2/3

నేడే ఓట్ల పండుగ

నేడే ఓట్ల పండుగ3
3/3

నేడే ఓట్ల పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement