ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు
మున్సిపాలిటీల్లో బుధవారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చూడనున్నారు. ప్రజలు స్వేచ్ఛగా.. శాంతియుతంగా ఓటు వేయాలని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. ఎన్నికల బందోబస్తుపై ఆయన
‘సాక్షి’తో మాట్లాడారు.
ఇప్పటివరకు నమోదైన కేసులపై...
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో జి ల్లాలో ఇప్పటికే 16 కేసులు నమోదు చేశాం. రూ.50వేల కంటే ఎక్కువ నగదు, ఎక్కు వ మొత్తంలో గిఫ్ట్ ఐటమ్స్ రవాణాపై సరైన ఆధారాలు లేకుంటే కేసులు నమోదు చేస్తున్నాం. అలాగే జిల్లా సరిహద్దుల్లో ఇప్పటివరకు ఆరు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశాం. ప్రతి వాహనాన్ని అణువణువునా తనిఖీ చేసిన తర్వాతే జిల్లాలోకి అనుమతిస్తున్నాం. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇప్పటికే సుమారు 100 మందిని ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో తహసీల్దార్ల ముందు బైండోవర్ చేశాం.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులకుగాను మొ త్తం 379 పోలింగ్ కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 30 పో లింగ్ కేంద్రాలు సమస్యాత్మకంగా గుర్తించాం. వాటి ని ఇప్పటికే గుర్తించి అక్కడ ఓటర్లు నిర్భయంగా ఓటు వేసేలా అన్ని చర్యలు చేపట్టాం. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. అదనపు బందోబస్తు ద్వారా ఎన్నికలు స జావుగా జరిగేలా చర్యలు చేపడుతున్నాం. నలు గురు డీఎస్పీలు, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్, 11 మంది సీఐలు, స్ట్రైకింగ్ ఫోర్స్ టీమ్‌లను ఏర్పాటు చేశాం.
మున్సిపల్ ఎన్నికల్లో చేపడుతున్న
బందోబస్తుపై..
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలు సజావుగా నిర్వహించేలా సుమారు 900 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం.


