చట్టానికి లోబడే ప్రచారంలో పాల్గొన్నాం
ధర్మపురి: పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను అనేక ఇబ్బందులు పెట్టారని, తాము మాత్రం అధికారం అడ్డం పెట్టుకుని ఎవరినీ ఇబ్బంది పెట్టిన చరిత్ర లేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ గొప్పదని, ఆయన చూపిన అడుగు జాడల్లో గెలిచిన తాను ఏనాడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో మంత్రిగా కొనసాగిన కొప్పుల ఈశ్వర్ ధర్మపురి వాసులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. సీఎంను ఒప్పించి సంస్కృతాంధ్ర కళాశాలకు నిధులు మంజూరు చేయించానని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుతానని అన్నారు. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే నాలుగు అమలు చేశామని మిగిలినవి త్వరలో నెరవేర్చుతమని పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యాలపై ఆగ్రహం
సీఎంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాకు గౌరవం ఇవ్వాలి తప్ప నోరు పారేసుకోవద్దని సూచించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదని, తా ము రెండేళ్లలో నిరుపేదలందరికీ కార్డులతోపాటు సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. గోదావరి పుష్కరాలకు బాసర నుంచి భద్రాచలం వరకు ఏర్పాట్లు చేస్తామన్నారు. తాము ఎన్నికలకోడ్‌ను ఉ ల్లంఘించలేదని, బ్రాహ్మణ సంఘంలో జరుగుతున్న ఓ కార్యక్రమానికి వెళ్లివస్తే.. సోషల్ మీడియాలో వక్రీకరించి తప్పుడు ప్రచారం చేశారని అన్నా రు. కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులున్నారు.


