మంచి నాయకుడిని ఎన్నుకుందాం.. | - | Sakshi
Sakshi News home page

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

Feb 11 2026 7:46 AM | Updated on Feb 11 2026 7:46 AM

మంచి

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

● ఓటు వజ్రాయుధం ● ఆలోచిద్దాం.. ఓటేద్దాం ● ఓటు దుర్వినియోగం చేయొద్దు

ఓటు అనేది వజ్రాయుధం వంటిది.

దానిని దుర్వినియోగం చేస్తే ఐదేళ్లపాటు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే

ఆలోచించి ఓటువేయాలని అభిప్రాయపడ్డారు పలువురు. మంచి నాయకుడిని ఎన్నుకోవాలని, మన భవిష్యత్తును మనమే

తీర్చిదిద్దుకోవాలని సూచిస్తున్నారు.

– రాయికల్‌

సమస్యలు పరిష్కరించే వారినే..

మున్సిపాలిటీల్లో సమస్యలపై అవగాహన ఉండి.. పరిష్కరించే నాయకుడిని ఎన్నుకోవాలి. అప్పుడే పట్టణం అభివృద్ధి చెందుతుంది. ప్రలోభాలకు లొంగి ఓటును దుర్వినియోగం చేసుకోవద్దు. సమర్థవంతమైన అభ్యర్థిని ఎంపిక చేసుకుని ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి మేలు.

– చెరుకు మహేశ్వరశర్మ, ప్రభుత్వ ఉపాధ్యాయుడు

ఓటును అమ్ముకోవద్దు

మున్సిపల్‌ ఎన్నికల్లో అమూల్యమైన ఓటును డబ్బులకు అమ్ముకోవద్దు. ఒకవేళ డబ్బు తీసుకున్నట్లయితే గెలిచాక సదరు ప్రజాప్రతినిధి మనం చెప్పినా మన మాట ఎవరూ వినరు. నిజాయితీగా ఓటు వేస్తే సమస్యలపై నిలదీయొచ్చు. ఎప్పుడు పరిష్కరిస్తావని ప్రశ్నించవచ్చు.

– పారిపల్లి వర్షిత, టీచర్‌

అవినీతికి అవకాశం ఇవ్వొద్దు

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులందరూ ప్రచారం చేస్తారు. మేం మంచి చేస్తామంటే.. మేం చేస్తామని చెబుతారు. కొందరు డబ్బులు వంటి ప్రలోభాలకు గురిచేస్తారు. గెలిచిన తర్వాత పదిరెట్లు మననుంచే వసూలు చేస్తారు. అలాంటి వారికి అవకాశం ఇవ్వొద్దు. – బూర్ల సాత్వి గృహిణి , రాయికల్‌

సమర్థులకే పెద్దపీట

రాజకీయాల్లో సమర్థవంతమైన నాయకులుంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయి. ఒక ఓటు ద్వారా సమర్థవంతమైన నాయకుడికి అవకాశం ఇస్తే ఐదేళ్ల పాటు అభివృద్ధి చెందుతుంది. సమర్థవంతమైన నాయకులను ఎన్నుకునేందుకు ఓటును కచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలి.

– అంజిత్‌రెడ్డి, రాయికల్‌

ప్రజల కోసం పనిచేయాలి

ఓటు వజ్రాయుధం. సరైన నాయకుడిని ఎన్నుకోవడానికి ఓటు ఉపయోగించుకుంటా. ప్రజల కోసం పనిచేసే నాయకుడిని గెలిపించేందుకు ఓటేస్తా. స్వార్థపరులను గెలిపిస్తే అవినీతి పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రజ సమస్యలను పరిష్కరించే సత్తా ఉన్నోడినే గెలిపించాలి.

– కొత్తపెల్లి రంజిత్‌, న్యాయవాది

ఆలోచించి ఓటు వేయాలి

ఓటు అనేది మన ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలి. ఐదేళ్లు మనల్ని పాలించే ప్రతినిధిని ఎన్నుకునేటప్పుడు బాగా ఆలోచించి ఓటు వేయాలి. నిస్వార్థంగా నిజాయితీతో పనిచేసే వారిని ఎన్నుకోవాలి. ఎలాంటి ప్రలోభాలకు లొంగకూడదు. – బాలె శేఖర్‌, విద్యావేత్త

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..1
1/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..2
2/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..3
3/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..4
4/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..5
5/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..6
6/6

మంచి నాయకుడిని ఎన్నుకుందాం..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement