పోలింగ్‌కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
జగిత్యాల/ధర్మపురి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఓటర్లకు ఇబ్బంది కలగకుండా పోలింగ్‌కేంద్రాల వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించామన్నారు. అనంతరం ధర్మపురిలోని పోలింగ్ కేంద్రాలను పరిశీ లించారు. వసతులు, ఏర్పాట్లపై ఓటర్లు, అధికారులను అడిగి తెలుసుకున్నా రు. కలెక్టర్ వెంట ఆర్డీవో మధుసూదన్, ధర్మపురి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులున్నారు.
ముగిసిన భాగవత సప్తాహం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి పుణ్యక్షేత్రంలోని బ్రాహ్మణ సంఘం భవనంలో నిర్వహించిన భాగవత సప్తాహం బుధవారం ముగిసింది. సమావేదం షణ్ముఖశర్మ ప్రవచనాలతో శ్రీమద్భాగవత సప్తాహ కథాయజ్ఞం చేపట్టారు. ఆరు రోజులపాటు సాగిన ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
పోలింగ్‌కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్


