డ్యూటీలో పోలీస్ కపుల్స్
భార్యాభర్తలిద్దరూ పోలీసు అధికారులే. ఇద్దరికీ ఒకేచోట ఎలక్షన్ డ్యూటీ. అయితే, ఇద్దరం కలిసి ఎన్నికల విధులు నిర్వర్తించడం మరిచిపోలేని అనుభూతి అని వారిద్దరూ సరదాగా చెప్పారు. పెద్దపల్లి రూరల్ ఎస్సైగా మల్లేశ్, మహిళా ఠాణా ఎస్సైగా రాజమణికి పెద్దపల్లి మున్సిపల్ కౌంటింగ్ విధులు కేటాయించారు. పోలీస్‌కపుల్స్ కావడంతో పోలీసు అధికారులు అందరూ విధుల్లో ఉన్న దంపతులను చూసి స్వీట్ మెమోరీ అని అభినందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


