‘సింహం’ గెలుపు | - | Sakshi
Sakshi News home page

‘సింహం’ గెలుపు

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

     ‘సింహం’ గెలుపు

‘సింహం’ గెలుపు

‘సింహం’ గెలుపు

గోదావరిఖని: రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 60 డివిజన్ల ఫలితాలు ఒక ఎత్తయితే.. 59వ డివిజన్‌ ఫలితం ఆద్యంతం ఉత్కంఠభరితంగా అభ్యర్థులను టెన్షన్‌ పెట్టించింది. డివిజన్‌లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఖాజ సనా, సింహం గుర్తుపై బాలసాని తిరుపతి పోటీ చేశారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠభరితంగా సాగింది. మొదటిసారి లెక్కింపులో బాలసాని తిరుపతికి రెండు ఓట్ల లీడింగ్‌ వచ్చింది. ఈక్రమంలో గెలుపు ప్రకటించాలని ఎన్నికల అధికారులు నిర్ణయించారు. అయితే తిరిగి లెక్కించాలని నిర్ణయించారు. అయితే అదే ఫలితం రావడంతో.. తిరస్కరణకు గురైన నాలుగు ఓట్లను పరిశీలించారు. అందులో రెండు పరిగణలోకి తీసుకోవాలని ఖాజ సనా కోరారు. అయితే ఎన్నికల అబ్వర్వర్‌ వద్దకు పంచాయితీ వెళ్లింది. తిరస్కరణకు గురైన ఓట్లు సరిగానే ఉన్నాయని గుర్తించి.. బాలసాని తిరుపతి రెండు ఓట్ల అత్యల్ప మెజారిటీతో గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. గతంలో 39వ డివిజన్‌లో జెట్టి జ్యోతి ఒక్క ఓటుతో మోహన్‌ అనే అభ్యర్థిపై విజయం సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement