ఓటమెరగని నేత..
పెద్దపల్లిరూరల్: పెద్దపల్లి మేజర్ పంచాయతీకి మూడుసార్లు వార్డు సభ్యుడిగా.. ఆ తర్వాత మున్సిపల్ కౌన్సిలర్‌గా.. ఇప్పుడు మూడోసారి ఎన్నికై నూగిల్ల మల్లయ్య ఓటమి ఎరగని నేతగా నిలిచారు. 2014 ఎన్నికల్లో కౌన్సిలర్‌గా ఎన్నికయ్యాక హంగ్ ఏర్పడింది. అనూహ్య పరిణామాల మధ్య మున్సిపల్ వైస్ చైర్మన్ పదవి నూగిల్ల మల్లయ్యనే వరించింది. ఈసారి జరిగిన ఎన్నికల్లో తాను గతంలో ఎన్నికై న వార్డు నుంచి రిజర్వేషన్ కలిసి రాక 21వ వార్డులో పోటీ చేసి విజయం సాధించారు.
ఆ వార్డులో గెలిస్తే చైర్‌పర్సన్!
పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ వార్డుగా 21వ వార్డు ప్రాధాన్యం సంతరించుకుంది. ఎందుకంటే.. ఈ వార్డు నుంచి గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికై న డాక్టర్ మమతారెడ్డి చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. ఈసారి ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి అంటూ నూగిల్ల మల్లయ్య పేరును ఎమ్మెల్యే విజయరమణారావు ప్రకటించారు. దీంతో ఆయన కూడా 21వ వార్డు నుంచి పోటీ చేసి గెలుపొందారు.


