నాలుగోసారి..
జగిత్యాల: గత మూడు పర్యాయాలు దేవేందర్‌నాయక్ కౌన్సిలర్‌గా గెలుపొంది మళ్లీ నాలుగోసారి సైతం విజయం సాధించి రికార్డు సృష్టించారు. దేవేందర్‌నాయక్ ఎస్టీ రిజర్వేషన్ నుంచి పోటీ చేస్తుంటారు. జగిత్యాలలో మొదటిసారి 2వ వార్డు నుంచి, రెండోసారి 9వ వార్డు, మూడోసారి 48వ వార్డు, ఈసారి 11వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొంది రికార్డు సృష్టించారు. బీఆర్‌ఎస్ పార్టీ స్థాపించినప్పుడు ఒకే ఒక్క బీఆర్‌ఎస్ కౌన్సిలర్‌గా గెలుపొందారు. అనంతరం బీఆర్‌ఎస్ నుంచి వరుసగా కౌన్సిలర్‌గా గెలుపొందుతూ వస్తున్నారు.


