తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు | - | Sakshi
Sakshi News home page

తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు

Feb 7 2026 9:43 AM | Updated on Feb 7 2026 9:43 AM

తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు

తలాపున గోదావరి ఉన్నా తాగునీరు ఇవ్వలేదు

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

ధర్మపురి: పట్టణానికి ఆనుకొని గోదావరి నది ఉన్నప్పటికీ పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజలకు తాగేందుకు మంచినీరు ఇవ్వలేదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయం 8, 9వ వార్డుల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించిన మంత్రి మధ్యాహ్నం 10, 11, 12 వార్డుల్లో కార్నర్‌ మీటింగ్‌ల్లో పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ప్రభుత్వ విప్‌గా, మంత్రిగా పనిచేసిన కొప్పుల ఈశ్వర్‌ ఏనాడు ప్రజల సమస్యలు పట్టించుకోలేదని ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారానికి రూ.30లక్షలు వెచ్చించి బోర్లు వేయించానని తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు, కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement