‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
మల్లాపూర్: ‘సాక్షి’ దినపత్రిక పదో తరగతి విద్యార్థులకు అందిస్తున్న స్టడీ మెటీరియల్‌తో ప్రయోజనం చేకూరుతుందని సర్పంచులు పోతవేని నారాయణ, దప్పుల పద్మ నర్సయ్య అన్నారు. మండలంలోని సాతారం, గుండంపల్లి జెడ్పీ హైస్కూల్‌లలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి ఆధ్వర్యంలో రూపొందించిన భౌతికశాస్త్రం, గణితం స్టడీ మెటీరియల్‌ను శుక్రవారం పంపిణీ చేశారు. విద్యార్థులు ఈ స్టడీ మెటీరియల్‌ను సద్వినియోగం చేసుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో సాక్షి సర్క్యులేషన్ ఇన్‌చార్జి సురేశ్, ఉప సర్పంచులు బేతి జగన్, జగ్గుల గంగాధర్, నాయకులు దప్పుల నర్సయ్య, పాఠశాలల హెచ్‌ఎంలు శ్రీహరి, మధు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
8న కరీంనగర్‌లో
ఐటీ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాం
కరీంనగర్: జిల్లాలోని యువతకు ఐటీరంగంపై స్పష్టమైన అవగాహన కల్పించాలనే లక్ష్యంతో కోడింగ్ ట్యూటర్ ఆధ్వర్యంలో ఐటీ జాబ్‌మేళా, ఇంటర్న్‌షిష్, కెరీర్ గైడెన్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈనెల 8న ఆదివారం ఉ.10 గంటలకు, కరీంనగర్‌లోని శ్వేత హోటల్‌లో కార్యక్రమం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఐటీ రంగంలో ప్రస్తుతం ఉన్న అవకాశాలు, కంపెనీలు ఏ నైపుణ్యాలను ఆశిస్తున్నాయి... గ్రాడ్యుయేషన్ తర్వాత యువత ఎలా సాఫ్ట్‌వేర్ రంగంలోకి అడుగుపెట్టవచ్చు.. ఇంటర్న్‌షిప్ ద్వారా ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయనే విషయాలను ఫణిరాజ్ జాలిగామ వివరించనున్నారు. ఈ కార్యక్రమం డిగ్రీ/ఇంజినీరింగ్ పూర్తిచేసిన, ఫైనల్ ఇయర్ విద్యార్థులు, ఐటీ రంగంలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు 89888 87333 నంబర్‌కి ఫోన్‌చేసి తప్పనిసరిగా రిజిస్టర్ అవ్వాలని సూచించారు. రిజిస్ట్రేషన్ చేసిన వారికే ప్రవేశం కల్పించబడుతుందన్నారు.
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా అభ్యర్థులందరూ ప్రచారంలో ఉండగా అధికారులు ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కరీంనగర్‌లో బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తయింది. జగిత్యాలకు తరలించనున్నారు. పోల్ చిట్టీలు సైతం ప్రతీ కాలనీల్లో పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సైతం ఏర్పాటు చేశారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
సేంద్రియ వ్యవసాయ క్షేత్రం సందర్శన
జగిత్యాలఅగ్రికల్చర్: సేంద్రియ వ్యవసాయం చేస్తున్న జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి గ్రామ రైతు రంగు నరేశ్ వ్యవసాయ క్షేత్రాన్ని శుక్రవారం వ్యవసాయాధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి వడ్డెపల్లి భాస్కర్ మాట్లాడుతూ, ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా వ్యవసాయం చేయడం వల్ల రైతులకు ఖర్చు తగ్గడంతో పాటు భూమి ఆర్యోగంగా ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు పెద్దపీట వేస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు తిరుపతి నాయక్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
న్యాయవాదుల నిరసన
ధర్మపురి: చేవెళ్ల బార్ అసోసియేషన్ సభ్యురాలు స్వప్నను హత్య చేసిన ఘటనకు నిరసనగా శుక్రవారం ధర్మపురి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు కోర్టు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆలుక వినోద్ మాట్లాడుతూ హత్యకు కారుకులైన వారిని వెంటనే ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో కేసు విచరణ జరిపి శిక్షించాలని అన్నారు. బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు రమేశ్, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌కుమార్, న్యాయవాదులు సత్యనారాయణరెడ్డి, రౌతు రాజేశ్, నిరంజన్, రామడుగు రాజేశ్, జితేందర్‌రెడ్డి, ఇంద్రకరణ్, శరత్, ఊర్మిళ, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ
‘సాక్షి’ స్టడీ మెటీరియల్ పంపిణీ


