సమర్థవంతంగా ఎన్నికల నిర్వహణ
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఎన్నికల ఆర్వోలు, ఏఆర్వోలతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలకు సంబ ంధించి ప్రతీ విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలని, శిక్షణ పొందిన ప్రతీ అధికారి ఎన్నికలు సజావుగా నిర్వహించాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమవళికి లోబడి ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించారు. పోలింగ్ జరిగే సమయంలో పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు, వెబ్‌కాస్టింగ్ పాత్ర చాలా కీలకమన్నారు. అన్ని రకాల మెటిరియల్స్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లలో సమకూర్చుకోవాలని సూచించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, నోడల్ అధికారి రవికుమార్ పాల్గొన్నారు.
పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకోవాలి
మున్సిపల్ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌ను ఉద్యోగులు వినియోగించుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఈనెల 11న జరుగనున్న మున్సిపల్ ఎ న్నికల్లో పాల్గొనే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వా రా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పి ంచినట్లు తెలిపారు. ఆదివారం ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ఐదు మున్సిపాలిటీల పరిధిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్లలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే ఉద్యోగులు డ్యూటీ ఉత్తర్వుల కాపీ, ఐడీ కార్డు అందజేయాలని తెలిపారు.


