భూ సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యలు పరిష్కరించాలి

Feb 7 2026 9:43 AM | Updated on Feb 7 2026 9:43 AM

భూ సమస్యలు పరిష్కరించాలి

భూ సమస్యలు పరిష్కరించాలి

మల్లాపూర్‌: భూ సమస్యలతో పాటు అన్ని ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత అన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పూర్తి చేయాలని అన్నారు. ప్రభుత్వం సాదాబైనామా, అసైన్‌మెంట్‌ భూముల దరఖాస్తులపై నిర్ణయం తీసుకోనందున అందుకనుగుణంగా భూ సమస్యల పరిష్కారానికి సిద్ధింగా ఉండాలని సూచించారు.

కేజీబీవీ విద్యాలయం తనిఖీ

మండల కేంద్రంలోని కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం, తరగతి గదులు, వంటశాల, స్టోర్‌రూంను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. రోజువారీ మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆమె వెంట తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఐలు రాజేశ్‌, అశోక్‌, కేజీబీవీ ప్రిన్సిపాల్‌ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement