ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

Feb 10 2026 7:45 AM | Updated on Feb 10 2026 7:45 AM

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాల: మున్సిపల్‌ ఎన్నికలకు అధికారులు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. జిల్లాలోని అన్ని బల్దియాల కమిషనర్లతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఓటర్‌ స్లిప్‌ల పంపిణీ, బ్యాలెట్‌బాక్స్‌లు, సామగ్రి మొత్తం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. పోలింగ్‌స్టేషన్ల వద్ద పారిశుధ్య నిర్వహణ, మరుగుదొడ్ల ఏర్పాటు చేయాలన్నారు. వృద్ధులు, దివ్యాంగులకు వీల్‌చైర్లు అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని రకాల బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులను ఆదేశించారు. పోలింగ్‌ అధికారులు డైరీ నిర్వహించాలని, ప్రతి అంశాన్ని కచ్చితంగా నమోదు చేసుకోవాలన్నారు. ఏర్పాట్లకు స్పెషల్‌ ఆఫీసర్లు, కమిషనర్‌ బాధ్యత వహించాలన్నారు.

మూడో ర్యాండమైజేషన్‌ పూర్తి

మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మూడో ర్యాండమైజేషన్‌ పూర్తి చేసినట్లు కలెక్టర్‌ అన్నారు. కలెక్టరేట్‌లో ఎన్నికల అబ్జర్వర్‌ కాళీచరణ్‌ సుదామారావుతో కలిసి ర్యాండమైజేషన్‌ చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాలవారీగా సిబ్బందిని నియమించామని, తప్పిదాలు జరగకుండా విధులు నిర్వర్తించాలని సూచించారు. బ్యాలెట్‌బాక్స్‌లు, పోస్టల్‌బ్యాలెట్ల తరలింపు సక్రమంగా చేపట్టాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఈనెల 11న జరగనున్న ఎన్నికల్లో ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని, గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాలని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement