నాంపల్లిపై చిన్నచూపు
వేములవాడఅర్బన్: వేములవాడకు వచ్చే భక్తులు నాంపల్లిగుట్టపై వెలసిన నృసింహస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ. కొలిస్తే.. మొలిచే పేరున్న నాంపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంపై అధికారులకు పట్టింపు కరువైంది. నాంపల్లిగుట్టపై ఏర్పాట్ల కల్పనలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఈనెల 14 నుంచి మొదలయ్యే మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు తూతేమంత్రంగానే చేసి చేతులు దులుపుకున్నారు.
మూలనపడ్డ వాటర్ ఫౌంటేయిన్
నాంపల్లిగుట్టపై భక్తుల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన వాటర్ ఫౌంటేయిన్, రంగులైట్ల ప్రదర్శన మూలనపడింది. పట్టించుకునే వారు లేక నిరుపయోగంగా మారింది.
వెలసిపోయిన కాళీయమార్ధనం
నాంపల్లిగుట్టపై ఏర్పాటు చేసిన కాళీయమర్ధనంపై కృష్ణుడి బొమ్మ భక్తులను ఆకట్టుకుంటుంది. అయితే రంగు వెలసిపోయింది. కాళీయమర్ధనం ఎదుట ఉన్న నరసింహుడి బొమ్మ రంగుపోయి కళావిహీనంగా కనిపిస్తుంది.
పారిశుధ్యం అస్తవ్యస్తం
నాంపల్లిగుట్టపై పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉంది. ఎక్కడ చూసిన చెత్తాచెదారం కనిపిస్తుంది. కాళీయమర్ధనం పక్కన చెట్ల కింద ఎక్కడ మొత్తం చెత్తమయంగా మారింది.
నిరుపయోగంగా మూత్రశాలలు
గతంలో మహాశివరాత్రికి భక్తుల కోసం లడ్డూ కౌంటర్ వెనుక, కాశీయమర్ధనం పక్కన తాత్కాళికంగా మూత్రశాలలు, మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. అవి వాడుకలో లేకపోవడంతో మూలకుపడ్డాయి. భక్తులకు అత్యవసరం ఏర్పడితే ఇబ్బందిగా ఉందని పలువురు వాపోతున్నారు.
మహాజాతరకు ఏర్పాట్లు అంతంతే..
గుట్టపై పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తం నృసింహస్వామిపై పట్టింపు కరువు
నాంపల్లిపై చిన్నచూపు
నాంపల్లిపై చిన్నచూపు


