విద్యుత్‌షాక్‌తో పంచాయతీ వర్కర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో పంచాయతీ వర్కర్‌ మృతి

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

విద్య

విద్యుత్‌షాక్‌తో పంచాయతీ వర్కర్‌ మృతి

జగిత్యాలక్రైం: సారంగాపూర్‌ మండలం రంగపేట గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్‌ వర్కర్‌, ఎలక్ట్రిషీయన్‌గా పనిచేస్తున్న ఏసు సుందర్‌రావు (60) విద్యుత్‌ మరమ్మతు చేస్తూ షాక్‌కు గురై మృతిచెందాడు. సుందర్‌రావు కొన్నేళ్లుగా పంచాయతీలో మల్టీపర్పస్‌ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఉదయం విద్యుత్‌ మరమ్మతు పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌షాక్‌ తగిలి మృతిచెందాడు. మృతుడి భార్య ఏసు రత్నమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గీత తెలిపారు.

హైదరాబాద్‌లో జగిత్యాల యువకుడు..

జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని మార్కండేయనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ చెట్‌పల్లి సంజయ్‌ (24) గురువారం చెరువులో అనుమానాస్పదంగా మృతిచెందాడు. సంజయ్‌ బుధవారం ఎన్నికల్లో ఓటు వేయడానికి జగిత్యాల వచ్చి ఓటు వేసి రాత్రి హైదరాబాద్‌ వెళ్లాడు. గురువారం మియాపూర్‌ చెరువులో మృతదేహమై కనిపించాడు. ఆయన మృతిపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గుండెపోటుతో ముంబయ్‌లో వ్యక్తి..

జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్‌ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన గర్వంద రాజేశ్‌గౌడ్‌ (40) ముంబయ్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. రాజేశ్‌గౌడ్‌ ముంబయ్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం విధులకు వెళ్లి వచ్చిన ఆయన గురువారం వేకువజామున అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటిచే మృతిచెందినట్లు నిర్ధారించారు. రాజేశ్‌గౌడ్‌ మృతదేహాన్ని అంబులెన్స్‌లో లక్ష్మీపూర్‌కు తీసుకొస్తున్నారు. శుక్రవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.

నేటి నుంచి శివరాత్రి ఉత్సవాలు

జగిత్యాలరూరల్‌:సారంగాపూర్‌ మండలం పెంబట్ల–కోనాపూర్‌లో శ్రీదుబ్బరాజేశ్వరస్వామి దేవస్థానంలో ఈనెల 13 నుంచి 17 వరకు మహాశివరాత్రి జాతర ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఈవో అనూష తెలిపారు. ఈనెల 14న స్వామివారి కల్యాణం, 15న జాగరణ, 17న స్వామివారి రథోత్సవం, 23న ఏకాదశ రుద్రాభిషేక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామన్నారు.

విద్యుత్‌షాక్‌తో    పంచాయతీ వర్కర్‌ మృతి1
1/2

విద్యుత్‌షాక్‌తో పంచాయతీ వర్కర్‌ మృతి

విద్యుత్‌షాక్‌తో    పంచాయతీ వర్కర్‌ మృతి2
2/2

విద్యుత్‌షాక్‌తో పంచాయతీ వర్కర్‌ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement