మట్టి నమూనా సేకరణపై అవగాహన
పెగడపల్లి: శాసీ్త్రయ వ్యవసాయ సాగుపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు గురువారం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో సాయిల్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. మట్టి నమూనా సేకరించే విధానంపై క్షత్రస్థాయిలో అవగాహన కల్పించి మట్టిలో పోషకాలు, సమతుల్యత, పంటల దిగుబడిపై వివరించారు. సేంద్రియ ఎరువుల వినియోగం, పంటల మార్పిడి పద్ధతులపై తెలియజేశారు. ఏవో శ్రీకాంత్, ప్రిన్సిపాల్ ప్రభాకర్‌రెడ్డి, ఏవోలు అక్షయ్, పవన్, సైన్స్ టీచర్ మధు పాల్గొన్నారు.


