గ్రామ సరిహద్దులు చూపించండి
వెల్గటూర్: తమ గ్రామ సరిహద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ తాళ్లకొత్తపేట సర్పంచ్ ధ్యావనపల్లి సుధాకర్ గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఎల్లంపల్లి ముంపు గ్రామమైన తాళ్లకోత్తపేట గ్రామ ఆర్‌అండ్‌ఆర్ కాలనీని సర్వే చేసి బౌండరీ సరిహద్దు ఏర్పాటు చేయాలని అన్నారు. అలాగే సర్వే నం.344లో అటవీశాఖ భూములకు సంబంధించి సర్వే చేయించి వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రంగు శ్రీకాంత్, వార్డు సభ్యులు కాల్ల సారవ్వ, సాయిని తిరుపతి, చేరుకూరి శ్రీనివాస్, దర్మాజ లక్ష్మీరాజం తదితరులు పాల్గొన్నారు.


