ఓట్ల లెక్కింపునకు 450 మంది పోలీసులతో బందోబస్తు
జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సందర్భంగా 450 మంది పోలీస్‌లతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఓట్లు లెక్కించే ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) డిగ్రీ కళాశాల వద్ద ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి గురువారం పరిశీలించారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మూడంచెల భద్రత పెడుతున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం ఆరు గంటల నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఊరేగింపులు, బాణాసంచా కాల్చడం, సభలు, సమావేశాలు, విజయోత్సవ ర్యాలీలు నిషేధమన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాలను డాగ్‌స్క్వాడ్, బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపడతామన్నారు. ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన గుర్తింపు కార్డులు ఉన్నవారికి మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతి ఉంటుందన్నారు. డీఎస్పీలు రఘుచందర్, రాములు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
కౌంటింగ్ నేపథ్యంలో 144 సెక్షన్ అమలు
విజయోత్సవ ర్యాలీలు నిషేధం
ఈసీ గుర్తింపుకార్డులుంటేనే కేంద్రంలోకి
ఎస్పీ అశోక్ కుమార్


