ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

ఉరేసు

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య చికిత్స పొందుతూ వ్యక్తి మృతి మహిళ మెడలోంచి పుస్తెలతాడు చోరీ ● బావిలో పడి విద్యార్థి మృతి

కథలాపూర్‌(వేములవాడ): మండలంలోని సిరికొండ గ్రామానికి చెందిన దేశవేని గంగనర్సయ్య(54) బుధవారం తన ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం ప్రకారం.. గంగనర్సయ్య కొంతకాలంగా మతిస్థిమితం కోల్పోయాడు. చికిత్స చేయించినా నయం కాలేదు. జీవితంపై విరక్తితో ఉరేసుకు ఆత్మహత్య చేసుకున్నాడు. గంగనర్సయ్య తండ్రి గంగారాం ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రవికిరణ్‌ పేర్కొన్నారు.

జమ్మికుంట: బజాజ్‌ ఆటో ఢీకొట్టిన ఘటనలో తలకు తీవ్ర గాయాలైన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందాడని జమ్మికుంట టౌన్‌ సీఐ రామకృష్ణ బుధవారం తెలిపారు. మున్సిపల్‌ పరిధిలోని ధర్మారం గ్రామానికి చెందిన మారపల్లి ఐలయ్య(59) అనే వ్యక్తి మంగళవారం రాత్రి ధర్మారం బస్టాండ్‌ వైపు కాలినడకన వస్తుండగా.. వీణవంక మండలం వల్బాపూర్‌ గ్రామానికి చెందిన బుర్రగళ్ల రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి అతివేగంగా బజాజ్‌ ఆటో నడుపుతూ ఢీకొట్టాడు. తలకు తీవ్ర గాయాలు కాగా.. జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. మృతుడి కుమారుడు అజయ్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

జగిత్యాలక్రైం: జగిత్యాలలోని అరవింద్‌నగర్‌లో బుధవారం మహిళ మెడలోంచి గుర్తుతెలియని ఇద్దరు దొంగలు రెండు తులాల పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన గట్ల శైలజ నడుచుకుంటూ వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి పుస్తెలతాడు లాక్కెళ్లారు. ఆమె కేకలు వేయడంతో స్థానికులు గుమిగూడేసరికే దొంగలు పారిపోయారు. స్థానికులు, బంధువులు పట్టణ పోలీసులకు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ ఏఎస్సై వేణు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

రేగు పండ్ల కోసం వెళ్లి..

వీణవంక: రేగు పండ్లు తెంపుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఓ విద్యార్థి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మల్లారెడ్డిపల్లికి చెందిన ఈర్నాల శ్రీనివాస్‌–శారద దంపతుల కుమారుడు రాజు(11) ఆరోతరగతి చదువుతున్నాడు. మంగళవారం గ్రామ శివారులోని ఓ వ్యవసాయ బావి వద్ద రేగుపండ్ల కోసం వెళ్లి కాలు జారి బావిలో పడ్డాడు. పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు రాజు కనిపించకపోవడంతో వెతుకుతుండగా కొలిపాక శ్రీనివాస్‌ బావిలో శవమై కనిపించాడు. మృతుడి తల్లి శారద ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆవుల తిరుపతి తెలిపారు. మాజీ సర్పంచ్‌ మేకల ఎల్లారెడ్డి విద్యార్థి దహన సంస్కారాలకు రూ.10వేలు అందజేశారు.

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య1
1/2

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య2
2/2

ఉరేసుకుని ఒకరి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement