● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ | - | Sakshi
Sakshi News home page

● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

Feb 14 2026 8:01 AM | Updated on Feb 14 2026 8:01 AM

● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి ల

● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి ల

● ప్రజాతీర్పుతో మరింత పెరిగిన బాధ్యత ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి: ధర్మపురి లక్ష్మీనృసింహుని దయ, ప్రజల ఆశీర్వాదంతో మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టం కట్టారని, ప్రజాతీర్పుతో మరింత బాధ్యత పెరిగిందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం ధర్మపురిలోని క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. ప్రజా సమస్యలపై పోరాడానని, ఓడినా గెలిచినా ప్రజలే దైవంగా భావించానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలతో ధర్మపురి ప్రజలు ఈ తీర్పునిచ్చారని, వారి రుణం తీర్చుకుంటానని అన్నారు. ధర్మపురిలో బస్‌డిపో, పాల్‌టెక్నిక్‌ కళాశాల, డిగ్రీ కాలేజీ, శాశ్వత తాగునీటి పరిష్కారం, గోదావరిలో కలుషిత నీటికి పులిస్టాప్‌ తదితర పనులు చేపట్టేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. అధికారంలో లేనప్పుడు ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు వచ్చినా ఓర్చుకొని ముందుకు సాగానని, అందుకే ప్రజలు తనను ఇంతవాడిని చేశారని గుర్తు చేశారు. రానున్న గోదావరి పుష్కరాలకు కోట్లాది రూపాయ ల నిధులు తీసుకొచ్చి ధర్మపురి రూపు రేఖలు మా ర్చేలా పనులు చేపడుతామని వివరించారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement