జాప్యం సరికాదు
గ్రామాలకు ప్రధాన చెరువుల మరమ్మతుల విషయంలో ప్రభుత్వం, అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. దుంపేట శివారులోని ఊర చెరువుకు గండి పడి నెలలు గడుస్తున్నా మరమ్మతు విషయంలో జాప్యం చేయడం దారుణం. ఇప్పటికై నా ప్రభుత్వం, అధికారులు చొరవచూపి త్వరగా మరమ్మతు చేయిస్తే రైతులు, చేపలు పెంచుకునే మత్స్యకారులకు ప్రయోజనం.
– మల్యాల రమేశ్, సర్పంచ్, దుంపేట
కొచ్చెరువే ఆధారం
గంభీర్‌పూర్ గ్రామానికి సాగు, తాగునీటికి ఆధారం కొచ్చెరువు. కొచ్చెరువులో నీళ్లుంటే గ్రామంలోని బోరుబావుల్లో నీళ్లుంటాయి. అలాంటి చెరువు మత్తడికి త్వరగా మరమ్మతు చేయించాలి. కొచ్చెరువులో నీళ్లు లేక యాసంగిలో పంటలకు సరిగా నీళ్లందవు. ప్రభుత్వం స్పందించి త్వరగా మరమ్మతు చేయించాలి.
– మొగుళ్ల మల్లేశం, రైతు, గంభీర్‌పూర్
మరమ్మతు చేయిస్తాం
గంభీర్‌పూర్ శివారులోని కొచ్చెరువు మత్తడికి మరమ్మతు చేయిస్తాం. దుంపేట చెరువుకు పడిన గండిని పూడ్చాలని గతంలో పనిచేసిన కాంట్రాక్టర్‌కు సూచించాం. పెగ్గెర్ల శివారులో ఊర చెరువు మత్తడి మరమ్మతుకు ప్రతిపాదనలు తయారు చేసి నివేదిక పంపిస్తాం. నిధులు మంజూరు కాగానే పనులు చేయిస్తాం.
– ప్రశాంత్,
నీటిపారుదలశాఖ డీఈ, వేములవాడ
జాప్యం సరికాదు
జాప్యం సరికాదు


