పీఠాధిపతి మరణం ధర్మపురికి తీరని లోటు
ధర్మపురి: ధర్మపురి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సచ్చితానంద సరస్వతి అకాల మరణం తీరని లోటని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పీఠాధిపతి మరణంపై చింతిస్తూ శుక్రవారం ధర్మపురిలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి మంత్రితో పాటు అర్చకులు, అధికారులు నివాళులర్పించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ, శ్రీశివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదుశ్రీ అన్నట్లు స్వామిజీ ఆజ్ఞ లేనిది ఏ కార్యక్రమాన్ని చేయలేదని, ఆయన సూచనల మేరకు ప్రతీ కార్యక్రమాన్ని నిర్వహించామని గుర్తు చేశారు. ధర్మపురిలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని లక్ష్మీనృసింహుడిని వేడుకుంటున్నట్లు తెలిపారు.
పోస్టల్ బ్యాలెట్‌పై అనాసక్తి
రాయికల్(జగిత్యాల): రాయికల్ మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్‌పై ఉద్యోగులు ఆసక్తి చూపలేదు. 12 వార్డులకు గాను దాదాపు 100 మంది ఉద్యోగులు ఉండగా, కేవలం 23 మంది మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ ఉద్యోగి యే పార్టీకి ఓటు వేశారన్న విషయం తెలిసిపోతుందనే ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్‌పై ఆసక్తి చూపలేదని తెలుస్తోంది.
ప్రశాంతంగా రాయికల్ బల్దియా కౌంటింగ్
రాయికల్(జగిత్యాల): రాయికల్ బల్దియా ఎన్నికల కౌంటింగ్ శుక్రవారం జగిత్యాలలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించగా, ఒంటిగంటలోపే 12 వార్డుల ఫలితాలు ప్రకటించారు. మొదటి ఫలితం 10వ వార్డు ప్రకటించగా, మొదటి రౌండ్‌లోనే 10,1,7,4 ఫలితాలు వెలువడ్డాయి. రెండో రౌండ్‌లో 2,5,8,11, మూడో రౌండ్‌లో 12,9,6,3 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, కమిషనర్ కీర్తి నాగరాజు, తహసీల్దార్ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పర్యవేక్షణలో ఫలితాలు ఎప్పటికప్పుడు ప్రకటించారు.
పట్టు నిలుపుకున్న జీవన్‌రెడ్డి
జగిత్యాల: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో పట్టు నిలుపుకున్నారని చెప్పుకోవచ్చు. అయితే కాంగ్రెస్ అధిష్టానం బీఫాంల విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని కాంగ్రెస్ వైపు ఉంటున్న ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి 35 బీఫాంలు కేటాయించారు. సీనియర్ నాయకులైన జీవన్‌రెడ్డికి 15 సీట్లు మాత్రమే కేటాయించారు. దీంతో ఈ వివాదం తీవ్రస్థాయికి చేరింది. జీవన్‌రెడ్డి వర్గీయులు పార్టీ తరఫున, రెబల్‌గా 17 మంది గెలుపొంది పైచేయిగా నిలిచారు. ఎమ్మెల్యే సైతం దాదాపు 18 సీట్లను కై వసం చేసుకున్నారు. కానీ, కాంగ్రెస్‌లో చోటుచేసుకున్న గొడవతో 40 పైగా గెలవాల్సిన కాంగ్రెస్ సీట్లు కేవలం 23కే పరిమితమయ్యాయి. చైర్మన్ ఎంపిక విషయంలో అధిష్టానం ఎలా పరిశీలిస్తుందోనని ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. కాగా, ఇప్పటికే జీవన్‌రెడ్డి బహిరంగంగానే బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టి పార్టీని ఇబ్బంది పెట్టే పరిస్థితి తెచ్చారని విమర్శిస్తున్నారు.
వేములవాడ టు మేడిపల్లి బస్సు సర్వీస్ ప్రారంభం
మేడిపల్లి(వేములవాడ): వేములవాడ నుంచి చందుర్తి, భీమారం మండల కేంద్రాల మీదుగా మేడిపల్లి మండల కేంద్రానికి నూతన బస్సు సర్వీసును శుక్రవారం కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. ఇంతకముందు వేములవాడ రాజన్న దర్శనానికి కోరుట్ల, జగిత్యాల మీదుగా వెళ్లేవారు. నూతన బస్సు సర్వీసుతో ఈ ప్రాంత ప్రజల రవాణా కష్టాలు తీరనున్నాయి. బస్సు సర్వీసు సౌకర్యం కల్పించిన విప్ ఆది శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సర్పంచ్‌లు ఏనుగుల లచ్చన్న, దాసరి గణేశ్, పుల్లురి ఉమారాణి, ఇట్టెడి రాజరెడ్డి, చెక్కపల్లి స్వాతి, మకిలి కావేరి, యాగండ్ల సౌజన్య పాల్గొన్నారు.
పీఠాధిపతి మరణం ధర్మపురికి తీరని లోటు
పీఠాధిపతి మరణం ధర్మపురికి తీరని లోటు


