● భద్రతను పర్యవేక్షించిన ఎస్పీ అశోక్‌కుమార్
జగిత్యాలక్రైం: మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. అనుమతి పొందిన సిబ్బంది, ఏజెంట్లను మాత్రమే కేంద్రం లోపలికి అనుమతించేలా కట్టుదిట్టమైన తనిఖీలు నిర్వహించామన్నారు. కౌంటింగ్ కేంద్రం పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేశామన్నారు. ఆయన వెంట డీఎస్పీలు రఘుచందర్, రాములు ఉన్నారు.


