ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

Feb 14 2026 8:01 AM | Updated on Feb 14 2026 8:01 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

వెల్గటూర్‌(ధర్మపురి): ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి కె.రాము అన్నారు. శుక్రవారం మండలంలోని రాజక్కపల్లి, కప్పారావుపేట పాఠశాలలను సెక్టోరల్‌ అధికారి చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాజక్కపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీలించారు. బోర్డుపై లెక్కలు చేయించడం, ఆంగ్ల పదాలు, వర్ణమాల రాయించడం వంటివి పరీక్షించారు. విద్యార్థుల సామర్థ్యాలకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రగతి కోసం ఉపాధ్యాయులు పోటీతత్వంతో పని చేయాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు సహకరించాలని సర్పంచ్‌ దోరిశెట్టి మల్లేశంను కోరారు. విద్యార్థుల అభ్యసన సామగ్రి కోసం సర్పంచ్‌ రూ.2,000 విరాళం ప్రకటించారు. అనంతరం డీఈవోను సర్పంచ్‌ సత్కరించారు. కప్పారావుపేట పాఠశాలలో గైర్హాజర్‌ విద్యార్థులపై దృష్టి సారించి రెగ్యులర్‌గా పాఠశాలకు వచ్చేలా ప్రోత్సహించాలని సూచించారు. ఎంఈవో బోనగిరి ప్రభా కర్‌, హెచ్‌ఎం రాధిక, కార్యదర్శి స్రవంతి, అంగన్వా డీ టీచర్‌ తిరుమల, సీఆర్‌పి వెంకటేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement