రాయబేరాలు షురూ! | - | Sakshi
Sakshi News home page

రాయబేరాలు షురూ!

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

రాయబేరాలు షురూ!

రాయబేరాలు షురూ!

మెట్‌పల్లి: మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం శుక్రవారం తేలనుంది. మొత్తం అభ్యర్థుల్లో విజేతలెవరో కొన్ని గంటల్లోనే వెల్లడి కానుంది. మెట్‌పల్లి మున్సిపల్‌లో 26వార్డులుండగా.. 150మంది పోటీ చేశారు. చైర్‌పర్సన్‌ పదవిని దక్కించుకోవాలంటే 14 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. పోలింగ్‌ సరళిని పరిశీలిస్తే ఈ సారి ఏ పార్టీకి కూడా పూర్తిస్థాయిలో మెజార్టీ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలే కాకుండా కొన్నిచోట్ల స్వతంత్ర, ఇతర పార్టీల అభ్యర్థులు విచ్చలవిడిగా ప్రలోభాలకు పాల్పడ్డారు. దీనివల్ల చాలావార్డుల్లో అభ్యర్థుల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఈ క్రమంలో ఓటరునాడీ అంతుచిక్కక పార్టీలన్నీ మెజార్టీపై మల్లగుల్లాలు పడుతున్నాయి.

గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ, స్వతంత్రులు

ఎన్నికల్లో బీజేపీ, ఇండిపెండెంట్‌ అభ్యర్థులు పలు వార్డుల్లో గట్టి పోటీ ఇచ్చారు. చైర్‌పర్సన్‌ పదవిపై గురి పెట్టిన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌కు పూర్తిస్థాయిలో మెజార్టీ రాని పక్షంలో అటు బీజేపీ, ఇటు ఇండిపెండెంట్ల మద్దతు ‘కీ’లకం కానుంది. బీజేపీ గత ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో గెలిస్తే.. ఈసారి అంతకంటే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నాలుగైదు వార్డుల్లో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన స్వతంత్రులు ఇప్పుడు గెలుస్తారనే ప్రచారం జరుగుతోంది. రెండో వార్డులో ఎంఐఎం, 20వార్డులో జనసేన అభ్యర్థి కూడా ప్రధానపార్టీలకు గట్టి పోటీ ఇవ్వడంతో ఆయా వార్డుల్లో విజయం ఎవరిని వరిస్తుందోనన్నది ఆసక్తిగా మారింది.

అడిగినన్ని డబ్బులు..

గెలిచే అవకాశాలున్న ఇండిపెండెంట్లల్లో ఎక్కువ మంది కాంగ్రెస్‌ రెబెల్స్‌ కావడం గమనార్హం. ఆ పార్టీ టికెట్‌ రాకపోవడంతో ఇండిపెండెంట్లుగా బరిలో నిలిచారు. ప్రస్తుతం వీరిపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ దృష్టి సారించాయి. గెలిస్తే తమ పార్టీలో చేరాలంటూ వారితో రాయ్ఙబేరాలుశ్రీ మొదలు పెట్టాయి. అడిగినంత డబ్బులు ఇస్తామంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి.

క్యాంపునకు తరలించడానికి ఏర్పాట్లు

ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులను క్యాంపునకు తరలించడానికి ప్రధాన పార్టీలు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశాయి. సోమవారం చైర్‌పర్సన్‌, వైస్‌చైర్మన్‌ ఎన్నిక జరగనుంది. క్యాంపు నుంచి నేరుగా అక్కడకు చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

మెజార్టీపై కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మల్లగుల్లాలు

ఎన్నికల్లో ఇరుపార్టీల మధ్య గట్టి పోటీ

‘కీ’లకం కానున్న స్వతంత్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement