కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలి
జగిత్యాల: ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. సోమవారం జగిత్యాల మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ప్రచారం నిర్వహించారు. రెండేళ్ల కాంగ్రెస్ పాలనతో ప్రజలు విసుగు చెందారని, ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో పేదలకు 4500 ఇళ్లు మంజూరయ్యాయని గుర్తు చేశారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు.
రాయికల్ బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరాలి
రాయికల్: రాయికల్ బల్దియాౖైపె బీఆర్‌ఎస్ జెండా ఎగరాలని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పార్టీ నుంచి 12 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని, ప్రజలు వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోనే రాయికల్ మున్సిపాలిటీ అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తరువాత ఎలాంటి పనులు ముందుకు కదలలేదని తెలిపారు. సమావేశంలో చైర్మన్ అభ్యర్థి కట్కం రవి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు ఎనుగందుల ఉదయశ్రీ, మారంపెల్లి రాణి, పార్టీ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.


