తొమ్మిదో వార్డులో 8వ వార్డు బ్యాలెట్ పేపర్లు
రాయికల్: మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రాయికల్ జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో 9వ వార్డుకు సంబంధించిన ఓటర్లు ఓటు వేసేందుకు వచ్చారు. కానీ.. వారికి 8వ వార్డు బ్యాలెట్ పేపర్లు ఇచ్చారు. దీంతో ఓటర్లు, ఏజెంట్లు, అభ్యర్థులు వెంటనే ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లగా కొంతసేపు పోలింగ్ నిలిచిపోయింది. మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడంతో ఓటింగ్ యథావిధిగా కొనసాగింది. రెండు బ్యాలెట్ పేపర్లు మాత్రమే 9వ వార్డులో 8వార్డు పేపర్లు వచ్చాయని తెలిపారు.


