రాజీనామా చేసి.. ఆపై గెలిచి.. | - | Sakshi
Sakshi News home page

రాజీనామా చేసి.. ఆపై గెలిచి..

Feb 14 2026 8:03 AM | Updated on Feb 14 2026 8:03 AM

   రాజీనామా చేసి.. ఆపై గెలిచి..

రాజీనామా చేసి.. ఆపై గెలిచి..

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఈర్ల స్వరూప ఆ పదవికి రాజీనామా చేశారు. తర్వాత మున్సిపల్‌ 7వ వార్డు నుంచి బరిలో నిలిచి 261 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇదేవిధంగా 26వ వార్డు కౌన్సిలర్‌ పదవికి ఏఐబీఎఫ్‌ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మున్సిపల్‌ ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాన్ని వదులుకొని బరిలో నిలిచిన కుక్క శ్రావణ్‌.. 52 ఓట్ల తేడాతో పరాజయం పొందారు. 2014 ఎన్నికల్లో 8వ వార్డు కౌన్సిలర్‌గా ఎన్నికై న స్వరూప.. వైస్‌ చైర్మన్‌ పదవిని ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో 3 ఓట్లతో పరాజయం పాలయ్యారు. మార్కెట్‌ చైర్‌పర్సన్‌ పదవికి రాజీనామా చేసి ప్రస్తుతం కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. అయితే ఈసారి చైర్‌పర్సన్‌ పదవి వరిస్తుందన్న ఆశతో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement