చిన్నారిని బలిగొన్న బైక్‌ | - | Sakshi
Sakshi News home page

చిన్నారిని బలిగొన్న బైక్‌

Feb 13 2026 3:42 AM | Updated on Feb 13 2026 3:42 AM

చిన్నారిని బలిగొన్న బైక్‌

చిన్నారిని బలిగొన్న బైక్‌

మల్లాపూర్‌: రోడ్డు దాటుతున్న ఓ చిన్నారిని బైక్‌ వేగంగా వచ్చి ఢీకొట్టగా.. తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మల్లాపూర్‌ మండలంలోని నడికుడలో విషాదం నింపింది. స్థానికుల కథనం ప్రకారం ఇబ్రహీంపట్నం మండలం ఫకీర్‌కొండాపూర్‌ గ్రామానికి చెందిన తోకల నాగరాజు, గౌతమి దంపతులకు కూతురు, కుమారుడు వేదాన్ష్‌ (4) సంతానం. నాగరాజు భార్యాపిల్లలతో కలిసి బుధవారం మల్లాపూర్‌ మండలం వాల్గొండలో బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయల్దేరారు. రాత్రి 7గంటల సమయంలో ఆటో దిగగానే వేదాన్ష్‌ రోడ్డు దాటేందుకు ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో మొగిలిపేట నుంచి అతివేగంగా వస్తున్న ఓ బైక్‌ వేదాన్ష్‌ని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వేదాన్ష్‌ను కుటుంబసభ్యులు హుటాహుటిన నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకుండాపోయింది. పరిస్థితి విషమించి అర్ధరాత్రి వేదాన్ష్‌ మృతి చెందాడు. బాలుడి మృతితో ఫకీర్‌కొండాపూర్‌లో విషాదం అలుముకుంది. బైక్‌ను అతివేగంగా.. నిర్లక్ష్యంగా నడిపి ప్రమాదానికి కారణమైన రాఘవపేటకు చెందిన ఇద్దరు యువకులను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

రోడ్డు దాటుతుండగా దూసుకొచ్చిన మృత్యువు

నిజామాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement