స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌లు
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు పోలింగ్ ముగియడంతో బ్యాలెట్ బాక్స్‌లను భారీ బందోబస్తు మధ్య ఎస్‌కేఎన్‌ఆర్ (ప్రభుత్వ) కళాశాలలోని స్ట్రాంగ్ రూమ్‌లకు తరలించారు. స్ట్రాంగ్ రూం పరిసరాల్లో పోలీసు అధికారులు, సిబ్బందితో పహారా ఏర్పాటు చేశారు. మల్టీలేయర్ భద్రతను అమలు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా పెట్టామన్నారు. ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బంది, అధికారులకు అభినందనలు తెలిపారు.
దుబ్బరాజన్న జాతరకు ప్రత్యేక బస్సులు
జగిత్యాలటౌన్: సారంగాపూర్ మండలం పెంబట్ల–కోనాపూర్‌లోని దుబ్బరాజన్న స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి జాతరకు ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్ కల్పన తెలిపారు. ఆలయంలో ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జాతర ఉంటుందని, బస్సుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తిస్తుందని పేర్కొన్నారు. జగిత్యాల నుంచి రూ.30 చార్జీగా నిర్ణయించినట్లు తెలిపారు. రాయికల్ మండలం కొత్తపేట నాగాలయానికీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు.
అన్ని స్థానాలూ మావే..
జగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయబోతున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు తెలిపారు. పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం మాజీమంత్రి కొప్పలు ఈశ్వర్, ఎల్.రమణ, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత, రాజేశంగౌడ్, రమణరావు ఎంతో కృషి చేశారని, అన్ని మున్సిపాలిటీల్లో జెండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థుల తరఫున కృషి చేసిన బీఆర్‌ఎస్ నాయకులకు అభినందనలు తెలిపారు.
రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీలకు శ్రీహర్ష
కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న కోల శ్రీహర్షగౌడ్ ఎస్జీఎఫ్ అండర్–17 విభాగంలో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడని ప్రిన్సిపాల్ వేణు తెలిపారు. కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి భాస్కర్, క్లాస్ టీచర్ జయపాల్ రెడ్డి, అధ్యాపకులు శ్రీహర్షను అభినందించారు.
కోరుట్ల, మెట్‌పల్లిలో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం
కోరుట్లరూరల్: కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీలపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు అన్నారు. పట్టణంలో బుధవారం ఎన్నికల సరళిని పరిశీలించారు. 13వ వార్డులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని తెలిపారు.
ఎస్‌కేఎన్‌ఆర్ కళాశాలకు రెండు రోజులు సెలవు
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల లెక్కింపు సందర్భంగా జగిత్యాల ఎస్‌కేఎన్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఈనెల 12, 13 తేదీల్లో సెలవు ప్రకటించినట్లు ప్రిన్సిపాల్ అశోక్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని, బోధన సిబ్బంది, బోధనేతర సిబ్బంది గమనించాలని సూచించారు.
స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌లు
స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌లు
స్ట్రాంగ్‌రూమ్‌కు బ్యాలెట్ బాక్స్‌లు


