● మహిళల తీర్పే కీలకం | - | Sakshi
Sakshi News home page

● మహిళల తీర్పే కీలకం

Feb 12 2026 7:33 AM | Updated on Feb 12 2026 7:33 AM

● మహిళల తీర్పే కీలకం

● మహిళల తీర్పే కీలకం

● మహిళల తీర్పే కీలకం

రాయికల్‌: మున్సిపాలిటీలోని 12 వార్డులకు బుధవారం జరిగిన పోలింగ్‌లో సైలెంట్‌ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థులు ఓటుకు రూ.2 వేల నుంచి రూ.3వేల వరకు పంపిణీ చేశారు. డబ్బులు తీసుకున్న ప్రతి ఓటరూ తమకే ఓటేస్తారని ఆశావహులంతా ఎవరికివారు అంచనాలు వేసుకుంటున్నా.. వారు ఎవరికి ఓటు వేశారో మాత్రం అంతుచిక్కడం లేదు. బల్దియాలో ఏ పార్టీకీ పూర్తిస్థాయిలో మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. హంగ్‌ ఏర్పడితే స్వంతంత్రులు కీలకంగా మారనున్నారు. చైర్మన్‌ అభ్యర్థులుగా బరిలో నిలిచిన కట్కం రవీందర్‌, మచ్చ నారాయణ, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మండ్లు, వైస్‌ చైర్మన్‌ గండ్ర రమాదేవి గెలుపోటములపై తీవ్ర చర్చ నడుస్తోంది. వీరి విషయంలో కొందరు బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement