యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు | - | Sakshi
Sakshi News home page

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు

Feb 10 2026 7:47 AM | Updated on Feb 10 2026 7:47 AM

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు

యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కేసు మదర్‌ థెరిసాలో డిప్లొమా విద్యార్థులకు వర్క్‌షాప్‌

జగిత్యాలక్రైం: జగిత్యాల నియోజకవర్గ యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నల్ల స్వామిరెడ్డిపై పట్టణ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో 35మంది అభ్యర్థులు కాంగ్రెస్‌ పార్టీతో సంబంధం లేకుండా.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో పనిచేసి.. ప్రస్తుతం అధికార దాహంతో కాంగ్రెస్‌ బీఫామ్‌లు తెచ్చుకుని.. కాంగ్రెస్‌ పార్టీ అని చెప్పడం సరికాదని కరపత్రాలు ముద్రించి న్యూస్‌పేపర్ల ద్వారా పంపిణీ చేశారు. దీనిపై 23వ వార్డు కాంగ్రెస్‌ అభ్యర్థి బోనగాని ఉషశ్రీ ఫిర్యాదు మేరకు స్వామిరెడ్డిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ఇసుక లారీ పట్టివేత

ఇబ్రహీంపట్నం: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న లారీని పట్టుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్‌కుమార్‌ తెలిపారు. మల్లాపూర్‌ మండలకేంద్రానికి చెందిన లారీ యజమాని ఇస్లావత్‌ శంకర్‌, డ్రైవర్‌ బూక్య వంశీ వేంపల్లి శివారు గోదావరి నది నుంచి లారీలో ఇసుకను అనుమతి లేకుండా నింపుకొని తరలిస్తుండగా ఇబ్రహీంపట్నంలోని ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద పట్టుకున్నామని, గ్రామ పంచాయతీ అధికారి సుంకం తిరుపతి ఫిర్యాదు మేరకు లారీ యజమాని, డ్రైవర్లపై కేసు నమోదు చేశామని పేర్కొన్నారు.

పెద్దపల్లిరూరల్‌: పెద్దపల్లి మదర్‌ థెరిసా ఇంజనీరింగ్‌ కాలేజీలో టాస్క్‌ ఆధ్వర్యంలో డీబీఎంఎస్‌ ప్రోగ్రామింగ్‌ విత్‌ ఎస్‌క్యూఎల్‌ అనే అంశంపై మూడురోజుల వర్క్‌షాప్‌ సోమవారం ప్రారంభమైంది. డీబీఎంఎస్‌ ప్రోగ్రామింగ్‌ విత్‌ ఎస్‌ క్యూ ఎల్‌కి సంబంధించి అత్యాధునిక ప్రయోగశాలలు కల్పించినట్లు రిసోర్స్‌ పర్సన్‌ రత్నప్రియ తెలిపారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌, ఏవో పవన్‌కుమార్‌, అకడమిక్‌ ఇన్‌చార్జి ఇజాజ్‌ఖాన్‌, హెచ్‌వోడీ శశికాంత్‌, నవ్య, షాకీర్‌, శిరీష పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement