ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని కలుషితం చేస్తుండు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని కలుషితం చేస్తుండు

Feb 9 2026 7:47 AM | Updated on Feb 9 2026 7:47 AM

ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని కలుషితం చేస్తుండు

ఎమ్మెల్యే కాంగ్రెస్‌ పార్టీని కలుషితం చేస్తుండు

జగిత్యాలటౌన్‌: సమాజమే తన కుటుంబం అని, తనను నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగితే ఊరుకోబోనని, వలసవాదులను తరిమికొట్టి నిజమైన కాంగ్రెస్‌వాదులకు గెలిపించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కోరారు. జిల్లాకేంద్రంలోని పలు వార్డుల్లో తన అనుచరులకు మద్దతుగా ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 40 ఏళ్లుగా ప్రజలమధ్య ఉన్నానని, కాంగ్రెస్‌ కార్యకర్తలను కాదని ఇతరులకు టికెట్‌ ఇవ్వడం న్యాయమా..? అని ప్రశ్నించారు. అణిచివేతకు గురవుతున్న వారికి అండగా చివరివరకూ పోరాడతానన్నారు. కష్టపడిన వారికి టికెట్‌ ఇవ్వకుండా తనను గోడుగోడునా ఏడిపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌ పార్టీని కలుషితం చేస్తున్నాడని, తాను కాంగ్రెస్‌ పార్టీని కాపాడేందుకు తాపత్రయ పడుతున్నానని పేర్కొన్నారు. అధికారం, ఆత్మగౌరవానికి జరుగుతున్న పోరులో నిజమైన కాంగ్రెస్‌వాదులను గెలిపించాలని పిలుపునిచ్చారు.

నమ్ముకున్నోళ్లకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు

వలసవాదులను తరిమి కొట్టి కాంగ్రెస్‌వాదులను గెలిపించండి

బల్దియా ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement