ఒకసారి భర్త, రెండుసార్లు భార్య విజయం
మెట్‌పల్లి: ప్రస్తుత రోజుల్లో ఒకసారి గెలవడమే సులువు కాదు. అలాంటిది మూడుసార్లు విజయం సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పట్ట ణానికి చెందిన చెట్లపల్లి మీనా, సుఖేందర్‌గౌడ్ దంపతులు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న మెట్‌పల్లి 2004లో మున్సిపాలిటీగా ఏర్పడింది. 2005లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో సుఖేందర్ 12వార్డు నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో 18వార్డు నుంచి ఆయన సతీమణి మీనాను బరిలో దింపి గెలిపించుకున్నారు. ఆ సమయంలో బీఆర్‌ఎస్ మద్దతుతో సుఖేందర్ కో–ఆప్షన్ సభ్యుడిగా ఎన్నికై .. అప్పటి పాలకవర్గంలో దంపతులిద్దరూ కొనసాగారు. 2020లో నిర్వహించిన ఎన్నికల్లో మారో మారు అదేవార్డు నుంచి సురేఖ గెలుపొందారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో మూడోసారి ఆమె పోటీ చేస్తున్నారు. విశేషమేమిటంటే ఈ వార్డులో అత్యధికంగా ఉన్న మైనార్టీల ఓట్లు గెలు పోటములను ప్రభావితం చేస్తాయి. బీజేపీ నుంచి నిలబడుతున్న మీనా ఆ వర్గం మద్దతును కూడా దక్కించుకుని విజేతగా నిలుస్తున్నారు. ప్రస్తుతం మరోమారు బరిలో నిలిచిన ఆమె ‘హ్యాట్రిక్’ విజ యాన్ని సాధిస్తానని ధీమా వ్యక్తం చే స్తున్నారు.
ఎన్నికల బరిలో దిగితే విజయమే..
ఆదర్శంగా నిలుస్తున్న మీనా, సుఖేందర్ దంపతులు


