కుటుంబ సభ్యులతో కలిసి..
హైదరాబాద్ వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నా. ఓటరుగా గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారి మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వినియోగించుకుంటా. భారత పౌరుడిగా ఓటును సద్వినియోగం చేసుకునే అవకాశం తొలిసారిగా వచ్చింది. కుటుంబ సభ్యులతో కలిసి ఓటేస్తా.
– రాచమల్ల అభిలాష్, అశోక్‌నగర్
హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉ ద్యోగం చేస్తున్నా. ఓటు హక్కు రావడమే కాదు.. దాన్ని సద్వి నియోగం చేసుకోవడం కూడా గొప్ప విషయమే. గత సంవత్సరం నమోదు చేసుకున్నా. తొలిసారిగా ఓటు వినియోగించుకుంటున్నా. సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన యువతకు ఓటేస్తా. వారిలో అవినీతి ఉండదు. – వాసాల స్నేహ, సాయినగర్
కుటుంబ సభ్యులతో కలిసి..


